సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Modified: సోమవారం, 19 నవంబరు 2018 (12:49 IST)

ఎన్టీఆర్ ఆరోజు నా వీపుపై లాగి ఒక్కటిచ్చారు... తలుపు దగ్గర పడ్డా... లక్ష్మీపార్వతి

ఒకవైపు ఎన్టీఆర్ బయోపిక్ తీస్తున్న ఈ తరుణంలో ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ఆయనకు సంబంధించిన ఓ వార్త బయటపెట్టారు. అదేమిటంటే... తనను ఎన్టీఆర్ ఓ విషయంలో చాచి వీపుపై కొట్టారంటూ చెప్పుకొచ్చారు. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 
 
తమ ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు వుండేవి కావన్నారు. ఐతే రాజకీయాల విషయంపై నన్ను కొట్టారనీ, ప్రభుత్వం పడిపోయినప్పుడు నన్ను కొట్టారని వెల్లడించారు. అప్పట్లో మీడియా తనను చాలా బాధలు పెట్టిందని, కరీంనగర్ జిల్లా నుంచి కొంతమంది నాయకులు తనను చూడాలని వస్తే నేను వారిని కలిసేందుకు మొండికేశాను. దాంతో ఎన్టీఆర్ గారు.... వెళ్లు... లక్ష్మీ వెళ్లు అని అన్నారు. 
 
ఐతే నేను వెళ్లేందుకు మొండికేశాను.... దాంతో ఆయనకు కోపం వచ్చి వీపు మీద ఒక్క దెబ్బ వేశారు. వెళ్లి తలుపు దగ్గర పడ్డాను. లేచి కన్నీళ్లు తుడిచుకుని వెళ్లాను. ఐతే ఆ తర్వాత నా దేవుడు ఎన్టీఆర్‌కు భోజనం పెట్టాను... కానీ నేను మాత్రం అన్నం తినలేదంటూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.