మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : బుధవారం, 24 జులై 2019 (21:22 IST)

పవర్ స్టార్‌కు పరుచూరి సలహా.. ఎంజీఆర్‌ను ఆదర్శంగా తీసుకుంటారా?(Video)

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. తమిళ దిగ్గజం ఎంజీ రామచంద్రన్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ సూచించారు. పవన్ సినిమాలు చేస్తూనే రాజకీయాల్లో కొనసాగాలన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఎంజీఆర్ సినిమాల్లో నటించారనే విషయాన్ని పరుచూరి గుర్తు చేశారు. 
 
రాజకీయాలను, సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ కొంతకాలం ముందుకు సాగారని అన్నారు. పవన్ కళ్యాణ్ సైతం సోషల్ మెసేజ్ ఉన్న అంశాలను తీసుకుని సినిమాలు చేయాలని అన్నారు. సినిమా ద్వారా ఎక్కువమందిని ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని సూచించారు.
 
ఇకపోతే.. పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమా చేస్తారా లేదా అనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. తాను రాజకీయాలకే పరిమితమవుతానని, సినిమాలు చేయబోరనే విషయంపై క్లారిటీ లేదు. మళ్లీ సినిమాల్లో నటించే విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ విముఖంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పరుచూరి ఇచ్చిన సలహాను పవర్ స్టార్ పాటిస్తారో లేదో తెలియాలంటే వేచి చూడాలి.