1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : ఆదివారం, 29 జులై 2018 (15:07 IST)

అమరావతి చంద్రబాబు రాజ్యం కాదు.. ఆయన మా రాజు కాదు : పవన్ కళ్యాణ్

అమరావతి ఏమైనా టీడీపీ అధినేత చంద్రబాబు రాజ్యమా అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో '2013 భూసేకరణ చట్ట పరిరక్షణ సదస్సు' విజయవాడలో నిర్వహించారు. ఇందులో పవన్ పాల్గొ

అమరావతి ఏమైనా టీడీపీ అధినేత చంద్రబాబు రాజ్యమా అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో '2013 భూసేకరణ చట్ట పరిరక్షణ సదస్సు' విజయవాడలో నిర్వహించారు. ఇందులో పవన్ పాల్గొని మాట్లాడారు.
 
గతంలో బాబుగారు తనతో మాట్లాడే సమయంలో 1,850 ఎకరాల్లోనే రాజధాని నిర్మిస్తామని చెప్పారని, ఆ భూములు కూడా అటవీ ప్రాంతం నుంచి తీసుకోవాలని చర్చ కూడా జరిగిందని చెప్పారు. కానీ, ఇపుడు అందుకు భిన్నంగా, రాజధాని కోసం లక్ష ఎకరాలను సేకరిస్తున్నారని మండిపడ్డారు.
 
'చంద్రబాబు! బాధ్యతాయుత అభివృద్ధి చేయలేరా? అడిగేవాళ్లు లేరనుకుంటున్నారా? ప్రజలు తోలు తీస్తారు.. గుర్తుపెట్టుకోండి' అంటూ హెచ్చరించారు. ప్రజలను కదిలించే శక్తి తనలో ఉందని, డబ్బుతో తననెవరూ కొనలేరన్నారు. 
 
అడ్డగోలుగా భూ సేకరణ చేస్తే చూస్తూ ఊరుకోమని, పిచ్చిపిచ్చి నిర్ణయాలు తీసుకుంటే రాజధాని నిర్మాణాన్ని అడ్డుకుంటామని పవన్ హెచ్చరించారు. ఎన్నికల సమయంలో పొత్తుల గురించి ఆలోచిస్తానని, ఇప్పుడు మాత్రం ఉద్యమాలు చేస్తానని స్పష్టంచేశారు. 
 
అంతేకాకుడా, ప్రస్తుతం అమరావతి కేవలం పెయింటింగ్స్‌కే పరిమితమై వుందన్నారు. ఇకపోతే, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కనిపిస్తే, ఆయనకు చంద్రబాబు కన్నుకొట్టి మనిద్దరం ఒకటే అనగలరంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. భవిష్యత్‌లో జనసేన, వామపక్షాల సారథ్యంలో నిజమైన అమరావతిని నిర్మిస్తామని ధీమాగా చెప్పారు.