శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శుక్రవారం, 10 ఆగస్టు 2018 (16:36 IST)

ఆ హంతకులు చచ్చేంత వరకు జైల్లో ఉండాల్సిందే...

మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని హత్య చేసిన నిషేధిత ఎల్టీటీఈ తీవ్రవాద సంస్థకు చెందిన హంతకులను వదిలిపెట్టే విషయంలో ఏమాత్రం దయాదాక్షిణ్యాలు చూపే ప్రసక్తే లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ మేరకు దేశ అత్య

మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని హత్య చేసిన నిషేధిత ఎల్టీటీఈ తీవ్రవాద సంస్థకు చెందిన హంతకులను వదిలిపెట్టే విషయంలో ఏమాత్రం దయాదాక్షిణ్యాలు చూపే ప్రసక్తే లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ మేరకు దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఓ అఫిడవిట్ సమర్పించింది.
 
ఎల్టీటీఈకి చెందిన ఓ మహిళ మానవబాంబుగా మారి.. 1991, మే 21న రాజీవ్ గాంధీని హతమార్చిన విషయం తెల్సిందే. ఈ కేసులో దోషులు గత 27 ఏళ్లుగా జైలు శిక్షలను అనుభవిస్తున్నారు. ఈ ఏడుగురు ముద్దాయిలను విడుదల చేయాలని తమిళనాడులోని అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. 
 
అయితే, వీరిని విడుదల చేసే ప్రసక్తే లేదని కేంద్రప్రభుత్వం స్పష్టంచేసింది. దీనిపై సుప్రీంకోర్టుకు క్లారిటీ ఇచ్చింది. వాళ్లను విడిచిపెడితే దేశంతోపాటు ప్రపంచానికి కూడా తప్పుడు సందేశం ఇచ్చినట్లు అవుతుందని కేంద్రం అభిప్రాయపడింది. 
 
రాజీవ్ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఏడుగురిని.. విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. సర్కార్ నిర్ణయాన్ని సీబీఐ వ్యతిరేకించింది. రాష్ట్రపతి కూడా దోషుల విడుదలను నిరాకరించారు. దోషులపై ఏమాత్రం జాలి చూపాల్సిన అవసరం లేదని హోంశాఖ స్పష్టంచేసింది.