శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
Written By srinivas
Last Modified: శనివారం, 28 జులై 2018 (18:15 IST)

న‌ర్త‌న‌శాల ఫ‌స్ట్ సింగిల్‌కి ముహ‌ర్తం ఫిక్స్(నాగశౌర్య వీడియో)

ఛ‌లో లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం త‌రువాత నాగ‌శౌర్య‌, ఐరా క్రియోష‌న్స్ కాంబినేష‌న్లో ప్రొడ‌క్ష‌న్ నెం-2 గా తెర‌కెక్కుతున్న చిత్రం న‌ర్త‌న‌శాల ఫ‌స్ట్ లుక్‌ని విడుద‌ల‌ని ఇటీవ‌లే విడుద‌ల చేశారు. ఈ లుక్‌కి సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన రెస్పాన్స్ రావ‌టం వి

ఛ‌లో లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం త‌రువాత నాగ‌శౌర్య‌, ఐరా క్రియోష‌న్స్ కాంబినేష‌న్లో ప్రొడ‌క్ష‌న్ నెం-2 గా తెర‌కెక్కుతున్న చిత్రం న‌ర్త‌న‌శాల ఫ‌స్ట్ లుక్‌ని విడుద‌ల‌ని ఇటీవ‌లే విడుద‌ల చేశారు. ఈ లుక్‌కి సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన రెస్పాన్స్ రావ‌టం విశేషం. ఈ చిత్రంలో క‌ష్మిర ప‌ర‌దేశి, యామిని భాస్క‌ర్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఇటీవ‌లే ఇట‌లీలో సాంగ్స్ షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్‌ప్రొడక్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. 
 
ఈ చిత్రంలో జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి, శివాజి రాజా, జెమిని సురేష్‌, రాఘ‌వ‌, రాకెట్ రాఘ‌వ మంచి పాత్ర‌ల్లో క‌నిపిస్తారు. శ్రీనివాస చ‌క్ర‌వ‌ర్తి ద‌ర్శ‌కుడు. చిత్ర స‌మ‌ర్ప‌కుడు శంక‌ర ప్ర‌సాద్ మూల్పూరి, చిత్ర నిర్మాత ఉష మూల్పూరి. ఛ‌లో లాంటి మ్యూజికల్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌కి సంగీతాన్ని అందించిన మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ ఈ చిత్రానికి చాలా మంచి సంగీతాన్ని అందించారు. ప్రముఖ రచయిత భాస్కరభట్ల సాహిత్యం అందించారు. జులై 31న 4.30 నిమిషాల‌కి మొద‌టి సింగిల్‌ని విజువ‌ల్‌గా విడుద‌ల చేయ‌టానికి నిర్మాత‌లు ప్లాన్ చేశారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ చిత్రాన్ని అగ‌ష్టు 31న విడుదల చేయ‌టానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. వీడియో చూడండి.
 
ఈ సంద‌ర్బంగా నిర్మాత ఉషా మూల్పూరి మాట్లాడుతూ.. ఛ‌లో చిత్రాన్ని మ్యూజిక‌ల్‌గా ఎంత ఘ‌న‌విజ‌యం చేశారో అంద‌రికి తెలుసు. ఇప్ప‌డు మా న‌ర్త‌నశాలని కూడా అంత‌కుమించి విజ‌యం చేయాల‌ని కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో మొద‌టి సింగిల్‌ని జులై 31న 4.30 నిమిషాల‌కి విడుద‌ల చేయ‌టానికి నిర్ణ‌యించాం. అలాగే ఈచిత్ర ఆడియో మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ అద్బుతంగా చేశాడు. ఛ‌లో కంటే మంచి విజ‌యాన్ని అందుకుంటామ‌న్న న‌మ్మ‌కం వుంది. భాస్కరభట్ల మంచి సాహిత్యం అందించారు. మా దృష్టిలో సినిమా అంటే ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందుకే మా ఐరా క్రియెష‌న్స్ నుండి వ‌చ్చిన ఛ‌లో కూడా పూర్తి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో చేశాము. ఇప్పుడు మా న‌ర్త‌న‌శాల కూడా పూర్తి వినోదాత్మ‌కంగా తీర్చిదిద్దాము. 
 
ఈ చిత్రం వ‌య‌సుతో సంబంధం లేకుండా అన్ని వ‌య‌సులవారిని , అన్ని వ‌ర్గాల వారిని అల‌రిస్తుంది. మా హీరో నాగ‌శౌర్య చాలా అందంగా క‌న‌ప‌డ‌తాడు. చాలా మంచి పాత్ర చేస్తున్నాడు. అలాగే హీరోయిన్స్ క‌ష్మిర ప‌ర‌దేశి, యామిని భాస్క‌ర్‌లు చాలా బాగా నటించారు. ఈ చిత్రంలో ఎవ‌రి పాత్ర‌కి వారు క‌రెక్ట్‌గా స‌రిపోయారు. ఎగిరినే మ‌న‌సు అని సాగే సాంగ్ విజువ‌ల్‌ని విడుద‌ల చేస్తున్నాం. ఈ సాంగ్ అంద‌ర్ని విప‌రీతంగా ఆక‌ట్టుకుంటుంద‌ని మా న‌మ్మ‌కం. ఈ చిత్రాన్ని అగ‌ష్టు 31న విడుదల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నాము అని అన్నారు.
 
నాగ‌శౌర్య‌, క‌ష్మర ప‌ర‌దేశి, యామిని భాస్క‌ర్‌, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి, అజ‌య్‌, శివాజి రాజ‌, సుధ‌, ప్రియ‌, జెమిని సురేష్‌, రాకేట్ రాఘ‌వ‌, స‌త్యం రాజేష్‌, రాఘ‌వ‌, ఉత్తేజ్‌, తిరుప‌తి ప్ర‌కాష్‌, ప‌ద్మ జ‌యంతి, మాధురి త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి క‌థ‌-స్క్రీన్‌ప్లే-మాట‌లు-ద‌ర్శ‌క‌త్వం.. శ్రీనివాస్ చ‌క్ర‌వ‌ర్తి, నిర్మాత‌.. ఉష మూల్పూరి.