పిల్లిపిల్లను కాపాడిన వానరం.. ఎంత తెలివి? (video)
Monkey Rescued Cat: సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా నేచర్ ఈజ్ అమేజింగ్ అనే యూజర్ ఓ వీడియోను పోస్టు చేశారు. ఈ వీడియోలో పిల్లిపిల్లను ఓ వానరం కాపాడింది.
పిల్లిపిల్ల కాలు జారి నీరు లేని బావిలో పడిపోయింది. ఆ బావి నుంచి బయటికి రాలేకపోయింది. దీన్ని గమనించిన వానరం ఆ బావిలోకి దూకింది. పిల్లిపిల్లను కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేసింది.
పిల్లిపిల్లను కాపాడటానికి తన తోటి వానరం సాయం కూడా తీసుకుంది. పిల్లిపిల్లతో బావి నుంచి పైకి ఎగిరేందుకు ప్రయత్నించింది. కానీ జరగలేదు. కానీ ఇంతలో ఓ బాలిక వానరం పడుతున్న కష్టాలు చూసి బావిలోని పిల్లిని కాపాడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.