1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : గురువారం, 5 ఏప్రియల్ 2018 (16:08 IST)

బాలీవుడ్ కండల హీరోకు ఐదేళ్లు జైలుశిక్ష..

జోథ్‌పూర్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ను ఐదేళ్ళ జైలుశిక్ష విధిస్తూ తీర్పును గురువారం వెలువరించింది.

జోథ్‌పూర్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ను ఐదేళ్ళ జైలుశిక్ష విధిస్తూ తీర్పును గురువారం వెలువరించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న మరో నలుగురు బాలీవుడ్ ప్రముఖులను నిర్దోషులుగా విడుదల చేసింది. నిర్దోషులుగా విడుదలైన వారిలో నటులు సైఫ్ అలీఖాన్, టబూ, సోనాలి బింద్రే, నీలంలు ఉన్నారు. వీరిని మేజిస్ట్రేట్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఇకపోతే, జైలుశిక్ష పడిన సల్మాన్ ఖాన్‌ను జోథ్‌పూర్ జైలుకు తరలించారు. 
 
1998 అక్టోబర్‌లో జరిగిన ఓ షూటింగ్ సందర్భంగా జోథ్‌పూర్ సమీపంలోని కంకణి గ్రామంలో హీరో సల్మాన్ రెండు కృష్ణజింకలను హతమార్చాడు. దీనిపై అటవీ సిబ్బంది ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు హతమార్చినట్లు సల్మాన్‌పై కేసు నమోదు అయ్యింది. ఇందులో సల్మాన్ ఖాన్‌పై వన్యప్రాణి సంరక్షణ చట్టం సెక్షన్ 51కింద కేసు నమోదు చేశారు. ఇతర నటులపై సెక్షన్ 149కింద కేసు నమోదు అయ్యింది. గత 20 యేళ్ళుగా సాగిన ఈ కేసు విచారణ మార్చి 28వ తేదీతో ముగిసింది. 
 
తుదితీర్పును జోథ్‌పూర్ మేజిస్ట్రేట్ కోర్టు గురువారం వెలువరించింది. నిజానికి ఈ కేసులో సల్మాన్‌కు గరిష్టంగా ఆరేళ్లు జైలు శిక్ష విధించాలని డిఫెన్స్ న్యాయవాదులు వాదించారు. అయితే తన క్లయింట్‌కు సాధ్యమైనంత తక్కువ శిక్ష వేయాలని సల్మాన్ తరపు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇరువైపు వాదనలు విన్న కోర్టు ఐదేళ్ల జైలు, రూ.10,000 జరిమానా విధిస్తూ చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ దేవ్‌కుమార్ తీర్పునిచ్చారు.