ముంబై మేయర్ ఎన్నికలు.. సోనూసూద్ ఏమన్నారంటే..?  
                                       
                  
				  				  
				   
                  				  2022లో నిర్వహించనున్న బఅహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బి.ఎం.సి) ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున సోనూసూద్ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై సోనూసూద్ స్పందించారు. ఈ వార్తల్లో నిజం లేదని, సామన్య వ్యక్తిగా నేను చాలా ఆనందంగా ఉన్నానని అన్నారు.
				  											
																													
									  
	 
	కాగా... లాక్‌డౌన్ సమయంలో పలువురికి సాయం చేసి రియల్ హీరోగా నిలిచారు సోనూసూద్. పలు సేవా కార్యక్రమాల్ని కొనసాగిస్తున్నారు. ఆయన రాజకీయాల్లోకి రావాలంటూ పలువురు అభిమానులు కోరుతుండగా.. మరికొందరు రాజకీయాల్లోకి రావద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.
				  
	 
	ఈ నేపథ్యంలో ఆయన త్వరలోనే రాజకీయాల్లోకి వస్తున్నారంటూ వార్తలు వెలువడుతున్నాయి. బిఎంసి ఎన్నికల్లో ఈ సారి గట్టి పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్ సెలబ్రిటీలని ఎంపిక చేసుకుందని, ఆ జాబితాలో సోనూతోపాటు మరో నటుడు రితేశ్ దేశ్‌ముఖ్, మోడల్, ఫిట్‌నెస్ పర్సనాలిటీ మిలింద్ సోమన్‌లు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	 
	త్వరలోనే ఈ ముగ్గురిలో ఒకరిని మేయర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించే అవకాశాలున్నాయని ప్రచారం సాగింది. వీరిలో రితేష్ దేశ్‌ముఖ్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ తనయుడు కూడా. కాగా, ఈ వార్తలను సోనుసూద్ కొట్టిపారేశారు.