శ్రీశాంత్ మహానుభావుడేమీ కాదు... నాతో డేటింగ్... పెళ్లాంతో లవ్వా? పవన్ 'పులి' హీరోయిన్

Nikesha-srisanth
Last Modified శుక్రవారం, 12 అక్టోబరు 2018 (13:02 IST)
పవన్ కల్యాణ్ పులి చిత్రంలో నటించిన హీరోయిన్ గుర్తుందా.... నికిషా పటేల్. ఇప్పుడు వార్తల్లోకి వచ్చేసింది. బిగ్ బాస్ 12 కంటెస్టెంట్ శ్రీశాంత్ వేషాలు చూస్తుంటే తనకు చిర్రెత్తి పోతోందని మండిపడుతోంది. మహానుభావుడులా ఫోజులు కొడుతున్నాడనీ, అవన్నీ వట్టి అబద్ధాలేనంటూ చెప్పుకొచ్చింది.

 
అసలు విషయానికి వస్తే.. బిగ్ బాస్ 12లో శ్రీశాంత్ కంటెస్టెంటుగా వున్నాడు. ఈ సందర్భంగా అతడు చెపుతూ... తన భార్య భువనేశ్వరి కుమారితో తను తొమ్మిదేళ్లుగా ప్రేమాయణం సాగించాననీ, ఆ తర్వాతే పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. ఈ మాటలను నికిషా తప్పుపట్టింది. 
 
తనతో ఐదేళ్ల క్రితం డేటింగ్ చేశాడనీ, మరి అతడితో వున్న కాలంలో పెళ్లాడిన భువనేశ్వరితోనూ లవ్వులో వున్నాడా? మరి నాతో డేటింగ్, లవ్ మాటేంటి? అన్నీ శుద్ధ అబద్ధాలు. ఏదో మహానుభావుడిలా మాట్లాడుతున్నాడు. శ్రీశాంత్ చెప్పేవన్నీ పూర్తి అవాస్తవాలు అంటూ మండిపడింది.
 
ఇంకా చెపుతూ... తను రోజూ బిగ్ బాస్ చూస్తూనే వున్నాననీ, ప్రత్యేకించి శ్రీశాంత్ ఏం చెపుతాడా అని ఆసక్తిగా చూస్తానంటోంది ఈ పులి హీరోయిన్. బ్రేకప్ చెప్పేశాక ఆ ఇంటరెస్ట్ ఎందుకో మరీ...?దీనిపై మరింత చదవండి :