సునందా పుష్కర్ మృతి కేసు : శశిథరూర్‌కు బెయిల్

సునందా పుష్కర్ మృతి కేసులో ఆమె భర్త, కేంద్ర మాజీ మంత్రి, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌కు బెయిల్ మంజూరైంది. ఆయన శనివారం ఢిల్లీ పాటియాలా కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసు విచారణ కోసం ఆయన వచ్చారు.

shashi tharoor
pnr| Last Updated: శనివారం, 7 జులై 2018 (11:42 IST)
సునందా పుష్కర్ మృతి కేసులో ఆమె భర్త, కేంద్ర మాజీ మంత్రి, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌కు బెయిల్ మంజూరైంది. ఆయన శనివారం ఢిల్లీ పాటియాలా కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసు విచారణ కోసం ఆయన వచ్చారు. ఆ తర్వాత ఆయన రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఆయనకు కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.

శశిథరూర్ శనివారం సునందా పుష్కర్ మృతి కేసు విచారణలో భాగంగా కోర్టు ముందు ప్రత్యక్షంగా హాజరయ్యారు. సమన్లకు స్పందిస్తూ శశి కోర్టుకు హాజరైనట్లు అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సమర్ విశాల్ తెలిపారు. సెషన్స్ కోర్టు ఆయనకు ముందే బెయిల్ మంజూరు చేసిందని, బెయిల్ బాండ్లను స్వీకరించినట్లు మెజిస్ట్రేట్ చెప్పారు. ఈ కేసులో తదుపరి విచారణ జూలై 26కు వాయిదా పడింది. భార్య సునందా పుష్కర్ మృతి కేసులో ఢిల్లీ పోలీసులు శశిథరూర్‌పై చార్జ్‌షీట్ దాఖలు చేశారు.దీనిపై మరింత చదవండి :