మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : సోమవారం, 9 ఏప్రియల్ 2018 (11:09 IST)

నరేంద్ర మోడీ మనిషి కాదు.. కఠిన శిల... : ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనిషి కాదనీ, కఠిన శిలలాంటి వ్యక్తి అని టీడీపీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆగ్రహించారు. ఇదే ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చని కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని మోడీపై ఆ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనిషి కాదనీ, కఠిన శిలలాంటి వ్యక్తి అని టీడీపీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆగ్రహించారు. ఇదే ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చని కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని మోడీపై ఆయన విమర్శలు గుప్పించారు. 
 
ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ, 'చరిత్రను పక్కదోవ పట్టించే పనులు చేయొద్దు. మేము చిత్తశుద్ధితో పోరాడుతున్నాం. అవసరమైతే రాజీనామాలు చేస్తాం. కానీ, రాజీనామాలు చేయడం ద్వారా ప్రత్యేక హోదా రాదు. ఐదుగురు రాజీనామాలు చేసినా, ఏడుగురు రాజీనామాలు చేసినా ఏం ఉపయోగం లేదన్నారు. 
 
పైగా, ప్రధాని నరేంద్ర మోడీ అనేటటువంటివాడు కఠిన శిల, స్పందించే హృదయం లేదు. ప్రేమాభిమానాలు అంటే అతనికి తెలియవు. ఆ పద్ధతిలో అతను పెరగలేదు. ప్రేమతో పనిచేయడం నేర్చుకో! అనాథాశ్రమానికి వెళ్లి ఇద్దరు పిల్లలను తెచ్చి పెంచుకుంటే, ఆ ప్రేమ మాధుర్యమేంటో తెలుస్తుంది! నీకేమి (మోడీ) తెలుస్తుంది! అమ్మను ఒకచోట మూలన పారేశావు, ఇంకొక ఆమెను ఇంకో చోట పారేశావు.. టింగ్ రంగా అంటూ నువ్వొక్కడివే ఉన్నావు! ప్రేమను పంచు.. ప్రేమను స్వీకరించు!' అంటూ మోడీకి జేసీ హితవు పలికారు.