మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : ఆదివారం, 6 మే 2018 (09:28 IST)

ఓటింగ్‌కు దూరంగా ఉండేవారినీ చేతులు కట్టేసి లాక్కొచ్చి... యడ్యూరప్ప

ఈనెల 12వ తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. 15వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.

ఈనెల 12వ తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. 15వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, ప్రధాని నరేంద్ర మోడీలు సుడిగాలి పర్యటన చేస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో నేతల పదునైన వ్యాఖ్యలతో కర్ణాటకలో ప్రచారం మరింత వేడెక్కిపోయింది. ఓటేయని వారి కాళ్లు, చేతులు కట్టి పడేసి మరీ పోలింగ్‌ కేంద్రాలకు లాక్కు రావాలని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి బీఎస్‌ యడ్యూరప్ప కార్యకర్తలను ఆదేశించారు. 
 
శనివారం బెలగావిలో జరిగిన ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఓటింగ్‌కు దూరంగా ఉన్న వారి కాళ్లు, చేతులు కట్టేసి లాక్కొచ్చి మహేశ్‌ దొడ్డగౌడార్‌(కిట్టూరు బీజేపీ అభ్యర్థి)కి ఓటు వేసేలా చూడంగని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.