గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Modified: మంగళవారం, 16 అక్టోబరు 2018 (19:59 IST)

దేశంలో చంద్రబాబుకి అవినీతి పాలనలో మూడోస్థానం... ఎవరు?(Video)

టిడిపి తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ నోరు జారారు. దేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఎపి అవినీతిలో మూడవ స్థానంలో ఉందని నాలుగు కరుచుకున్నారు తిరుపతి టిడిపి ఎమ్మెల్యే సుగుణమ్మ. అవినీతి రహిత పాలన అందించడంలో ఎపి మూడవ స్థానంలో ఉందంటూ ఒక సర్వే రిపోర్టును చదువుతూ చంద్రబాబు అవినీతి పాలనను అందిస్తున్నారని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.
 
తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో సుగుణమ్మ వ్యాఖ్యలతో మీడియా ప్రతినిధులే అవాక్కయ్యారు. ఇలాంటి వ్యాఖ్యలతో అధినేతను అప్పుడప్పుడు నాయకులు ఇరుకునపెడుతూనే వున్నారు. మంత్రి నారా లోకేష్ కూడా అప్పుడప్పుడు నోరు జారుతూ ఇబ్బంది పడుతుంటారు. సుగుణమ్మ మాటలు వీడియోలో చూడండి.