గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 జనవరి 2023 (22:54 IST)

ఆఫ్ఘనిస్తాన్‌, ఢిల్లీలో భూకంపం.. గడ్డకట్టే ఉష్ణోగ్రతల మధ్య...

earthquake
earthquake
ఆఫ్ఘనిస్తాన్‌లోని ఫైజాబాద్‌ను భూకంపం వణికించింది. హిందూకుష్ పర్వతశ్రేణిలో ఈ భూకంపం ఏర్పడింది. ఫైజాబాద్‌కు దక్షిణంగా ఈ భూప్రకంపనలు నమోదైనాయి. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో 5.9 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించాయి. దేశ రాజధాని ఢిల్లీలో గడ్డకట్టే ఉష్ణోగ్రతల మధ్య గురువారం ఢిల్లీలో భూకంపం సంభవించింది. 
 
దేశ రాజధాని ఢిల్లీలోని నోయిడా పరిసర ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు వచ్చాయి. ఆఫ్ఘనిస్తాన్‌లోని ఫైజాబాద్‌కు దక్షిణాన గురువారం రాత్రి 7.55 గంటలకు భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ధృవీకరించింది. అలాగే హర్యానా, రాజస్థాన్, జమ్మూకశ్మీర్ ప్రాంతాల్లోనూ భూమి కంపించింది.