శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శనివారం, 26 మే 2018 (11:05 IST)

వేంకటేశ్వర స్వామిని వెంకన్న చౌదరి అనడం తప్పేనంటున్న టీడీపీ ఎంపీ

అధికార తెలుగుదేశం పార్టీ నేతలు ఇటీవలి కాలంలో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా, ఎంపీలు, మంత్రులు అయితే మరింత శృతిమించి మాట్లాడుతున్నారు. తాజాగా తిరుమల ఏడుకొండల వేంకటేశ్వరస్వామి.. వెంకన్నచౌదరి

అధికార తెలుగుదేశం పార్టీ నేతలు ఇటీవలి కాలంలో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా, ఎంపీలు, మంత్రులు అయితే మరింత శృతిమించి మాట్లాడుతున్నారు. తాజాగా తిరుమల ఏడుకొండల వేంకటేశ్వరస్వామి.. వెంకన్నచౌదరి అంటూ టీడీపీ రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి.
 
మోసం చేసిన బీజేపీకి కర్ణాటకలో వెంకన్నచౌదరి తగిన బుద్ది చెప్పారని.. వెంకన్న చౌదరి సాక్షిగా ఇచ్చిన హామీని తప్పారంటూ రాజమండ్రి మహానాడులో ఎంపీ మురళీమోహన్ వ్యాఖ్యానించారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. టీడీపీ కుల పిచ్చి, అహంకారానికి పరాకాష్ట అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. ఈ వ్యాఖ్యలు పెద్ద వివాదం కావటం స్వయంగా వివరణ ఇచ్చారు.
 
రాజమండ్రి మినీ మహానాడులో తాను తిరుపతి ఏడుకొండలవాడి గురించి మాట్లాడుతూ వెంకన్న చౌదరి అని నోరుజారిన మాట వాస్తవమే అన్నారు. అందుకు క్షమాపణలు చెప్పారు. అప్పటివరకు బుచ్చయ్యచౌదరితో మాట్లాడుతూ.. ప్రసంగానికి పిలవడంతో వెంకన్న చౌదరి అనడం జరిగిందే తప్ప.. ఉద్దేశపూర్వకంగా వచ్చింది కాదని అన్నారు. ఏడుకొండల వాడంటే ఎంతో భక్తిప్రపత్తులు ఉన్నాయన్నారు. నోరుజారి అన్నమాటను ఇంత పెద్ద ఇష్యూ చేస్తారని అనుకోలేదన్నారు. 
 
స్వామివారితో పాటు.. భక్తులు అందరికీ క్షమాపణలు చెప్పారు. తనకు అన్ని కులాలు సమానమే అని.. కుల దురభిమానం లేదని తెలిపారు. ఏడుకొండలవాడికి కులం ఆపాదించే తెలివితక్కువ వాడిని కాదన్నారు. పొరపాటున వచ్చిన మాటకు పెద్దమనసుతో క్షమించాలని కోరారు.