సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 2 మార్చి 2022 (10:28 IST)

ప్రపంచంలో ఏ దేశ రక్షణ వ్యవస్థనైనా నిర్వీర్యం చేయగలం, బటన్ నొక్కితే ఏ ప్రదేశమైనా బూడిదే: పుతిన్ ప్రకటన

ప్రపంచంలోని ఏ దేశ రక్షణ వ్యవస్థలనైనా పూర్తిగా పనికిరాకుండా నిర్వీర్యం చేయగల శక్తి రష్యాకు వున్నదని, కొత్త క్రూయిజ్ క్షిపణిని రష్యా అభివృద్ధి చేసిందని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు.

 
హైపర్‌సోనిక్ క్షిపణి ప్రపంచంలో ఎక్కడికైనా చేరుకోగలదనీ, యూరప్- ఆసియాల్లో ఈ క్షిపణిని అడ్డుకోగల శక్తి లేనే లేదన్నారు. దానిని కూల్చాలని లేదా అడ్డుకోవాలని ప్రయత్నించినా అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదనీ, నిర్దేశించిన లక్ష్యాన్ని బూడిద చేస్తుందని చెప్పారు. ఫెడరల్ అసెంబ్లీలో స్టేట్ ఆఫ్ నేషన్ ప్రసంగంలో చెప్పారు.

 
అణువుధార్మిక పేలుడు పదార్థాలతో తక్కువ ఎత్తులో ఎగిరుతూ వెళ్లగల, గుర్తించలేని కష్టతరమైన క్రూయిజ్ క్షిపణి తమ సొంతమన్నారు. ఇది ఆచరణాత్మకంగా అపరిమిత పరిధితో అనూహ్య మార్గాల ద్వారా ఖండాంతర ప్రదేశాలను దాటి లక్ష్యాన్ని నాశనం చేయగలదన్నారు.