సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శుక్రవారం, 30 మార్చి 2018 (12:23 IST)

కింగ్ మేకర్‌ను నేనే... నేను చెప్పిన వ్యక్తే ప్రధాని : చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత తానే కింగ్ మేకర్‌ను అవుతానని, అపుడు తాను చెప్పిన వ్యక్తే ప్రధానమంత్

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత తానే కింగ్ మేకర్‌ను అవుతానని, అపుడు తాను చెప్పిన వ్యక్తే ప్రధానమంత్రి అవుతారంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ 37వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నామని, తాను చెప్పిన వ్యక్తే ప్రధాని అవుతారని అన్నారు. విభజన తర్వాత రాష్ట్రం ఎంతగానో నష్టపోయిందని, రాష్ట్రం బాగుపడుతుందనే ఉద్దేశంతోనే నాడు బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందని అన్నారు.
 
తెలుగుదేశం పార్టీ ఏనాడూ హింసా రాజకీయాలు చేయలేదని, ప్రజాస్వామ్య బద్ధంగానే రాజకీయాలు చేస్తున్నామని అన్నారు. సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆర్థిక అసమానతలు తగ్గిస్తున్నామని, విద్యుత్ రంగంలో రెండోతరం సంస్కరణలు తీసుకొచ్చామని, పోలవరం ప్రాజెక్టును కచ్చితంగా పూర్తి చేసి తీరతామని అన్నారు. రెండంకెల అభివృద్ధికి ఏపీ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిందని చెప్పుకొచ్చారు.