మోదీకి ఒకే ఒక్క ఛాన్స్... మిస్ చేస్కుంటే అంతే... ఏంటది?

మంగళవారం, 14 నవంబరు 2017 (20:14 IST)

modi

వచ్చే ఏడాది ప్రవేశపెట్టబోయే బడ్జెట్ 2018 పరిపూర్ణమైన బడ్జెట్ కాబోతోంది ఎన్డీయే సర్కారుకు. ఎందుకంటే వచ్చే 2019లోనే మోదీ సర్కార్ ఎన్నికలను ఎదుర్కోవలసి వుంటుంది. కాబట్టి 2018 బడ్జెట్ చాలా కీలకమైనది. ఈ బడ్జెట్లో మోదీ ప్రజలను ఆకట్టుకునేందుకు పూర్తి కసరత్తు చేయాల్సి వుంది. ఇందులో ఏమాత్రం ఫెయిల్ అయితే మాత్రం ఆ తదుపరి ఎన్నికల్లో దాని ప్రభావం చూపించ మానదు. 
 
ఇప్పటికే దేశంలో GST, పైన వ్యతిరేకత వ్యక్తమైంది. కానీ అదేమీ లేదని పాలకులు చెప్పుకుంటున్నారనుకోండి. కానీ పెద్దనోట్ల దెబ్బ చాలా రంగాలను కుదేలు చేసింది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలి మూలుగుతోంది. దేశంలో చాలాచోట్ల రియల్టర్లు నష్టాల ఊబిలో కూరుకుని అప్పులుపాలయిన ఉదంతాలు వెలికి వస్తున్నాయి. ఇకపోతే గురించి ఏకంగా తమిళనాడులో సినిమా కూడా వచ్చేసింది. 
Vijay
 
మెర్సల్ అంటూ విజయ్ హీరోగా తెరకెక్కిన తమిళ చిత్రంలో మోదీ సర్కార్ తీసుకువచ్చిన జీఎస్టీపై సెటైర్లు విసరడంతో అది పెద్ద వివాదమైంది. ప్రజలు ఆ చిత్రానికి జేజేలు పలికారు. దీన్నిబట్టి ప్రభుత్వంపై వ్యతిరేకత ఏస్థాయిలో వున్నదో అర్థమవుతుంది. కాబట్టి జీఎస్టీలో వున్న లోటుపాట్లను సరిదిద్దుకోవాల్సిన అవసరం మోదీ సర్కారుపై వుంది. వీటితో పాటు యువతకు ఉపాధి కల్పనకు తీసుకోవలసిన చర్యలు చాలానే వున్నాయి. ఇలా చెప్పుకుంటూ వెళితే వచ్చే Budget 2018లో నరేంద్ర మోదీ పూర్తిగా కసరత్తు చేసి వెళితేనే ఫలితాలు వుంటాయి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కొన తప్పదు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

కోడిగుడ్డ ధర వింటే గుడ్లు తేలేయాల్సిందే...

దేశవ్యాప్తంగా నిత్యవసర సరకుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అలాగే, కూరగాయల ధరలు కూడా ...

news

వృద్ధురాలిని కిందపడేసిన సిబ్బంది... సారీ చెప్పిన ఇండిగో

దేశంలో ఉన్న ప్రైవేట్ విమానయాన సంస్థల్లో ఒకటైన ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రతిష్ట మరోమారు ...

news

ఎయిర్‌ ఏషియా బంపర్ ఆఫర్.. రూ.99లకే ఫ్లైట్ జర్నీ

మలేషియాకు చెందిన బడ్జెట్ విమానయాన సంస్థ ఎయిర్‌ ఏషియా (ఇండియా) బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది ...

news

దిగివచ్చిన అరుణ్ జైట్లీ.. 177 వస్తువులపై పన్ను భారం తగ్గింపు

కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ దిగివచ్చారు. దేశంలో 'ఒకే దేశం - ఒకే పన్ను' ...