గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2018-19
Written By selvi
Last Updated : గురువారం, 1 ఫిబ్రవరి 2018 (12:01 IST)

ఆలు, ఉల్లి ఉత్పత్తిని పెంచేందుకు ఆపరేషన్ గ్రీన్: అరుణ్ జైట్లీ

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ 2018-19 ఆర్థిక సంవత్సరానికిగానూ సాధారణ బడ్జెట్‌ను గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. భారత్‌ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థగా నిలబడింది. త్వరలోనే ఐద

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ 2018-19 ఆర్థిక సంవత్సరానికిగానూ సాధారణ బడ్జెట్‌ను గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. భారత్‌ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థగా నిలబడింది. త్వరలోనే ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఆవిర్భవించనుందని అరుణ్ జైట్లీ ప్రకటించారు.
 
* 1000 మంది బీటెక్ విద్యార్థుల కోసం ప్రధాన మంత్రి రీసెర్చ్ ఫెలో ఫథకం 
* కుటుంబానికి రూ.5 లక్షల బీమా 
* రూ.1200 కోట్లతో పేదలకు ఆరోగ్య కేంద్రాలు 
 
* టీబీ చికిత్స కోసం రూ.600 కోట్లు కేటాయింపు 
* అన్ని కుటుంబాలకు జీవన బీమా యోజన 
* ఆలు, ఉల్లి ఉత్పత్తిని పెంచేందుకు ఆపరేషన్ గ్రీన్  
 
* మత్స్య శాఖ, పశుసంవర్ధక శాఖలకు రూ.10,000కోట్లు.
* జాతీయ వెదురు పరిశ్రమల కోసం రూ.1,290కోట్ల కేటాయింపు.
* కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను ఇక నుంచి చేపలు, పశు పెంపకం దారులకు విస్తరిస్తాం.
* 42 మెగాఫుడ్‌ పార్కులు పటిష్టం 
* ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్లకు రూ.1400కోట్లు
 
* గిరిజన ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి ఏకలవ్య పాఠశాలలు 
* విద్యారంగంలో మౌలిక సౌకర్యాలకు రూ.లక్ష కోట్లు.
* 2017 జాతీయ ఆరోగ్య పథకంలో భాగంగా ఆయుష్మాన్‌ భారత్‌
* వడోదరలో రైల్వే విశ్వవిద్యాలయం
 
* బ్లాక్‌బోర్డు నుంచి డిజిటల్‌ బోర్డు
* కార్యక్రమంలో భాగంగా డిజిటల్‌ విద్యా కేంద్రాలు
* వ్యవసాయ రుణాలకు రూ.11లక్షల కోట్లు.
* జాతీయ జీవనోపాధి కార్యక్రమానికి రూ.5,750కోట్లు.
* ఢిల్లీలో కాలుష్య నివారణకు ప్రత్యేక చర్యలు
 
* ఆపరేషన్‌ గ్రీన్‌ కోసం రూ.500కోట్లు.
* పర్‌ఫ్యూమ్స్‌, ఆయిల్స్‌ కోసం రూ.200కోట్లు.
* గృహ నిర్మాణానికి ప్రత్యేక గృహనిర్మాణ నిధి. దేశవ్యాప్తంగా 55లక్షల గృహాల నిర్మాణానికి చర్యలు.
* ప్రధానమంత్రి గ్రామసడక్‌ యోజనతో మరిన్ని గ్రామీణ రోడ్ల అనుసంధానం.
* 2022 నాటికి అన్ని గ్రామాల్లో పక్కా రోడ్ల నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు.