శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. »
  3. భవిష్యవాణి
  4. »
  5. వాస్తు శాస్త్రం
Written By PNR
Last Updated : శనివారం, 7 జూన్ 2014 (15:36 IST)

సింహ ద్వార గేట్ల నిర్మాణం ఎలా ఉండాలి?

ఇంటి నిర్మాణంలో ప్రాధాన్యమిచ్చే అంశాల్లో ఒకటి సింహ ద్వారం. ఇలాంటి సింహ ద్వారానికి గేట్ల అమరికపై గృహ యజమానులు పెద్దగా దృష్టిసారించరు. ఇదే అంశంపై వాస్తు నిపుణులను సంప్రదిస్తే... సాధారణంగా ఆగ్నేయ స్థలంలో తూర్పు సింహద్వార గృహం కట్టడం శ్రేయస్కరం. కాబట్టి ప్రహరీ గేట్లు కూడా తూర్పు ఈశాన్యం, తూర్పు ఉచ్ఛంలో పెట్టుకోవడం మంచిది. 
 
దక్షిణ స్థలంలో గేటు దక్షిణ స్థలంలో నిర్మించిన గృహంలో దక్షిణం ఉచ్ఛం నుంచి దక్షిణ ఆగ్నేయం వరకు ఉన్న స్థలంలో సింహద్వారం ఎదురుగా గేటు పెట్టాలి. తూర్పు దిశన రెండు గేట్లు పెట్టాలను కుంటే తూర్పు ఈశాన్యంలో పెద్దగేటు, తూర్పు ఉచ్ఛంలో సింహద్వారం ఎదురుగా చిన్న గేటు, ఉత్తరం ఉచ్ఛంలో సింహద్వారం ఎదురుగా చిన్న గేటు పెట్టాలి.
 
నైరుతి స్థలంలో గేటు నైరుతిస్థలంలో నిర్మించిన గృహంలో దక్షిణ లేదా పశ్చిమ దిశలలో ఏదో ఒక దిశకు మాత్రమే సింహద్వారం, ఇతర వాస్తు విషయాలు దృష్టిలో పెట్టుకుని గేటు పెట్టాలి. దక్షిణం ఉచ్ఛం నుంచి దక్షిణ ఆగ్నేయం వరకు, పశ్చిమ ఉచ్ఛం నుంచి  పశ్చిమ వాయువ్యంలో గేటు పెట్టాలి. 
 
ఉత్తర దిశను ఉత్తర ఉచ్ఛం ఈశాన్యం వరకు, పశ్చిమ ఉచ్ఛం నుంచి పశ్చిమ వాయువ్యం వరకు ఎక్కడైనా సింహ ద్వారం ఎదురుగా గేటు పెట్టుకోవాలి. విశాలమైన ఆవరణ కలిగి రెండు గేట్లు  పెట్టదలచినపుడు పశ్చిమ  వాయువ్యంలో పెద్దగేటు, పశ్చిమ ఉచ్ఛంలో సింహద్వారం ఎదురుగా చిన్న గేటు పెట్టాలి. అలాగే.. వాయువ్య స్థలంలో గేటు వాయువ్య స్థలంలో నిర్మించిన గృహంలో అవసరాన్ని, సింహ ద్వారాన్ని బట్టి రెండు వైపులకు లేదా కేవలం ఒకవైపుకు పెట్టుకోవచ్చు.