శుభోదయం : ఈ రోజు రాశి ఫలితాలు 20-10-17

మేషం: కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు ఊహించని చికాకులు ఎదురవుతాయి. దైవ దీక్షల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రిప్రజెంటేటివ్‌లు, ఉపాధ్యాయులకు ఒత్తిడి పెరుగుతుంది. ప్రైవేట్ సంస్థల్లోని వారిక

time
raman| Last Updated: శుక్రవారం, 20 అక్టోబరు 2017 (06:25 IST)
మేషం: కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు ఊహించని చికాకులు ఎదురవుతాయి. దైవ దీక్షల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రిప్రజెంటేటివ్‌లు, ఉపాధ్యాయులకు ఒత్తిడి పెరుగుతుంది. ప్రైవేట్ సంస్థల్లోని వారికి యాజమాన్యంతో ఏకీభావం కుదరదు. నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు పురోభివృద్ధి కానవస్తుంది.

వృషభం: కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. విద్యా, వైజ్ఞానిక విషయాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. రావలసిన ధనంలో కొంత మొత్తం అందుకుంటారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు.

మిథునం: రచయితలకు, పత్రికా రంగంలో వారికి కీర్తి, గౌరవాలు పెరుగుతాయి. స్త్రీలకు స్కీములు, ప్రకటనల పట్ల అవగాహన అవసరం. రాజకీయాల్లో వారికి అవకాశవాదులు అధికమవుతున్నారని గమనించండి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. ఉద్యోగస్తుల దైనందిన కార్యకలపాలు ప్రశాంతంగా సాగుతాయి.

కర్కాటకం: వ్యాపారాల్లో నష్టాలను కొంత మేరకు అధికమిస్తారు. స్త్రీలకు ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. ఆకస్మికంగా సన్నిహితులతో మార్పులు కానవస్తాయి. ఉద్యోగస్తుల సమర్థతకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు.

సింహం: ఓ మంచి వ్యక్తి అభిమానాన్ని పొందుతారు. కొంత ఆలస్యంగానైనా అనుకున్న పనులు సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. స్త్రీలకు పొరుగు వారిలో గుర్తింపు, రాణింపు లభిస్తుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. కొబ్బరి, పండ్ల, పూల, తినుబండారాల వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది.

కన్య: ప్రైవేట్ సంస్థల్లోని వారు మార్పులకై యత్నాలు ఆటంకాలు తప్పవు. దంపతుల మధ్య పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. ఎరువులు, క్రిమి సంహారక మందుల వ్యాపారులకు చికాకులు తప్పవు. ప్రేమికుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ఊహించని ఖర్చుల వల్ల చేబదుళ్ళు తీసుకోక తప్పవు.

తుల: మీ శ్రీమతి మొండి వైఖరి మీకు ఆందోళన కలిగిస్తుంది. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెళకువ, ఏకాగ్రత చాలా అవసరం. విద్యార్థులు ఉపాధ్యాయులతో ఏకీభవించలేకపోతారు.

వృశ్చికం: కొబ్బరి, పండ్ల, పూల, తినుబండారాల వ్యాపారులకు పురోభివృద్ధి. రావలిసిన ధనంలో కొంత మొత్తం అందుకుంటారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. అందరితోను కలుపుగోలుగా వ్యవహరించి మీ పనులు చక్కబెట్టుకుంటారు.

ధనస్సు: ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేయవలసివస్తుంది. ఖర్చులు ఊహించినవే కావడంతో ఇబ్బందులు వుండవు. గృహ నిర్మాణాల ప్లానుకు ఆమోదం లభించడంతో పాటు లోను మంజూరవుతాయి. ప్రముఖుల ఇంటర్వ్యూల కోసం అధిక సమయం వేచి వుండాల్సి వస్తుంది. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు ఫలిస్తాయి.

మకరం: బంధువులతో గృహంలో సందడి కానవస్తుంది. తొందరపడి హామీలివ్వటం మంచిది కాదు. అర్థాంతరంగా నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ప్రయత్నపూర్వకంగా కొన్ని వ్యవహారాలు సానుకూలమవుతాయి. పాత రుణాలు తీరుస్తారు. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. విద్యా, వైజ్ఞానిక విషయాల పట్ల ఏకాగ్రత వహిస్తారు.

కుంభం: సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయం అందుతాయి. కాంట్రాక్టర్లకు ఎప్పటి నుంచో ఆగి వున్న పనులు పునఃప్రారంభం అవుతాయి. ఏ యత్నం కలిసిరాక నిరుద్యోగులు నిస్తేజానికి లోనవుతారు. ఖర్చులు పెరిగినా మీ అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు కాగలదు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది.

మీనం: ప్రేమికుల అత్యుత్సాహం అనర్ధాలకు దారితీస్తుంది. బ్యాంకింగ్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. లిటిగేషన్ వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. అయినవారిని అనుమానించడం వల్ల మానసిక అశాంతికి లోనవుతారు. శస్త్ర చికిత్సలు విజయవంతం కావడంతో వైద్యులకు మంచి గుర్తింపు లభిస్తుంది.దీనిపై మరింత చదవండి :