సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 నవంబరు 2024 (19:06 IST)

వాస్తు దోషాలు, గ్రహ దోషాలకు చెక్ పెట్టాలంటే..?

sea salt
sea salt
ఎలాంటి నెగిటివ్ ఎనర్జీని అయినా ఉప్పు తరిమికొడుతుందని నమ్ముతారు. ఆ ఉప్పును చిన్న మూటలాగా చేసి.. ఇంటి ప్రధాన ద్వారం వద్ద వేలాడ దీస్తే శుభం జరుగుతుంది. ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఆపుతుంది. ఇంటి వైపు సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. 
 
అంతేకాకుండా ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉప్పు కట్టను వేలాడదీయడం వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయి. వాస్తు దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. ఇంకా జ్యోతిష్యశాస్త్రంలో ఉప్పు శుక్ర గ్రహానికి సంబంధించింది. 
 
ఇంటి ప్రధాన ద్వారంపై ఉప్పు వేయడం వల్ల వైవాహిక సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉప్పు కట్టను కట్టడం వల్ల ఇంటి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఇంట్లో సంపదకు కొత్త మార్గాలు లభిస్తాయి. 
 
అప్పులు తీరిపోతాయి. ఇంటి యజమాని జాతకంలో శుక్ర గ్రహం బలపడుతుంది. ఫలితంగా వారికి చాలా మంచి జరుగుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.