శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By Selvi
Last Updated : మంగళవారం, 25 నవంబరు 2014 (15:23 IST)

వాస్తు: తూర్పు-ఉత్తర దిశల్లో ఖాళీ స్థలముంటే?

వాస్తు ప్రకారం తూర్పు- ఉత్తరములందు ఖాళీ స్థలమున్నట్లైతే ఈ దిశలయందు గోడలపై నెట్టి షెడ్‌లు వగైరా కట్టడములు కట్టకూడదు. ఈ గోడలకు ఏ వస్తువులను చేరవేయకూడదు. తూర్పు- ఉత్తరగోడలకు జేర్చి షెడ్‌లు వగైరాలు క్రిందికి వంటి నిర్మించడం ద్వారా కళత్ర, పుత్రారిష్టములు సంప్రాప్తించగలవు. 
 
ఈశాన్యమునందే విధమైన చిన్న కట్టడములుగానీ స్తంభములు, వృక్షములు, నీటి టాంకులు మొదలగునవి ఉన్నట్లైతే ధనక్షయము కలగడమే కాకుండా భార్యకు దీర్ఘవ్యాధులు తప్పవు. 
 
ఉత్తరసింహద్వారముగల ఇంటికి తూర్పు- ఉత్తరములయందు వసారాలు తప్పక నిర్మించవలెను. ఈవసారాలు వంటి కట్టవలెనే గానీ ఎత్తుగా నిర్మించకూడదు. తూర్పు-ఉత్తర వసారాలు ఎత్తుగానున్నట్లైతే శత్రుబాధ తప్పదు. వంటి కట్టడం వలన సన్మిత్రలాభము, గౌరవప్రాపకములు ఏర్పడతాయి.
 
దక్షిణ దిశయందు వసారా వేయునప్పుడు ఎత్తు గోడలు పెట్టి నిర్మించవలెను. దక్షిణ, పశ్చిమ దిశలందు వసారాలు ఎట్టి పరిస్థితుల్లోనూ వంగియుండకూడదని వాస్తు నిపుణులు అంటున్నారు.