శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By Selvi
Last Updated : గురువారం, 14 మే 2015 (18:05 IST)

ఒకే ఆవరణలో రెండు ఇళ్లు కట్టాల్సి వస్తే..?

ఒక ఆవరణలో రెండు ఇళ్ళు కట్టాల్సి వస్తే పడమటి ఇంటి కంటె, తూర్పు ఇల్లు తక్కువ చేసి కట్టడం ఐశ్వర్యదాయకం. ఒక ఆవరణలో రెండు గృహాలున్నప్పుడు-దక్షిణంవైపు ఉన్న ఇంటి కంటే, ఉత్తరం వైపు ఉన్న ఇల్లు తక్కువ ఎత్తుతోను-పల్లంగాను ఉన్నట్లయితే, పుత్ర పౌత్ర వృద్ధి కలుగుతుంది. ఒకే ఆవరణంలో రెండు ఇళ్లు కట్టాల్సి వచ్చినప్పుడు మొదట తూర్పు గృహం ఇల్లు కట్టకూడదు. పశ్చిమపు ఇంటే తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. 
 
గృహావరణంలో తూర్పు, దక్షిణ, పశ్చిమం, ఉత్తరం దిక్కులలో మరుగుదొడ్డి ఎక్కడ ఉన్నా ధననాశనం సంభవిస్తుంది. అట్లే-ఒక ఆవరణంలో రెండు గృహాలను నిర్మించాల్సి వచ్చినప్పుడు, మొదట ఉత్తర గృహాన్ని నిర్మించి తర్వాత దక్షిణంలో రెండో గృహాన్ని నిర్మించరాదు. దక్షిణపు గృహానికే ప్రధమ ప్రాధాన్యత ఇవ్వాలని వాస్తు నిపుణులు అంటున్నారు.