శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By Selvi
Last Updated : గురువారం, 25 జూన్ 2015 (18:23 IST)

వాస్తు పురుషుని స్థితిని బట్టి ఇంటి నిర్మాణం చేపట్టాలి..

వాస్తు పురుషుని దృష్టి ప్రసరించు దిశయందు- పాదాలు చాచియున్న దిశయందు ఇళ్ళు కట్టరాదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. భాద్రపద, ఆశ్వీజ, కార్తీక మాసాల్లో తూర్పు వైపు శిరస్సు ఉంటుంది. అదే మార్గశిర, పుష్య, మాఘ మాసాల్లో దక్షిణ వైపు శిరస్సు ఉంటుంది. 
 
జ్యేష్ఠ, ఆషాఢ, శ్రావణ మాసాల్లో ఉత్తర వైపు శిరస్సు, ఫాల్గుణ, చైత్ర, వైశాఖలలో పడమటి శిరస్సు ప్రకారం వాస్తు పురుషుడు ఎప్పుడూ ఎడమ పక్కగా శయనిస్తుంటాడు. పైన చెప్పిన మాసాల్లో వాస్తు పురుషుని పడకదిశ గ్రహించి, తల వెనుక భాగం- వీపు భాగం ఏవైపు ఉంటే ఆ దిక్కుల్లో ఇళ్ళు నిర్మించుకోవచ్చునని వారు చెబుతున్నారు.