పూజగది ఏ దిశలో అమర్చుకోవాలో తెలుసా..?

Last Updated: బుధవారం, 10 అక్టోబరు 2018 (15:09 IST)
పరమేశ్వరుడు మహా ప్రీతికరమైన దేవుడు. స్వామివారంటే ఇష్టపడని వారంటూ ఉండరు. కోరిన వరాలను వెంటనే ప్రసాదించే స్వామి పరమేశ్వరుడే. శివుడు అంటే గుర్తుకు వచ్చేవారు అమ్మవారు అంటే పార్వతీదేవి. పార్వతీదేవి సకలసౌభాగ్యాలు కలిగేంచే దేవి. దీర్ఘసుమంగళిగా ఉండాలని భక్తులందరు వ్రతాలు, నోములు చేస్తుంటారు. ఈ వ్రతాలు, నోములతో అమ్మవారు ప్రీతిచెంది వారు కోరిక కోరికలు తక్షణమే నెరవేరుస్తారు.
  
 
అలానే ఈశానుడు అంటే ఈశ్వరుడని అంటానరు. అయితే కొందరు ఈశాన్య దిశను మూసివేసి ఇతర దిశలలో ఇంటి నిర్మాణాలు చేస్తుంటారు. అంటే పూజగది.. పూజగది ఎప్పుడు ఈశాన్య దిశలోనే ఉండాలి. ఒకవేళ ఈశాన్య దిశ మూసివేసుంటే ఆ గదికి తూర్పు లేదా ఉత్తరం నందు ఒక ద్వారం పెట్టుకుంటే ఈశాన్య దోషాలు తొలగిపోతాయి. 
 
ఇంటి నిర్మాణాలు చేసేవారు, నిర్మించివారు ఈశాన్య దిశలో పూజగది ఉండేలా అమర్చుకుంటే ఈశాన్య పూజదోషాలు తొలగిపోతాయని వాస్తుశాస్త్రం చెబుతోంది. ప్రతి ఇంటికి ఏది మూస్తే అద్భుతం, ఏది తెరిస్తే అద్భుతం అనే విషయం ప్రధానం. కాబట్టి ఈశాన్యంలో పూజగది అమర్చుకుంటే సకలసంపదలు చేకూరుతాయని పురాణాలలో చెప్పబడింది.దీనిపై మరింత చదవండి :