శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By Selvi
Last Updated : సోమవారం, 11 మే 2015 (18:18 IST)

ఆంధ్రా స్టైల్ మష్రూమ్ ఎలా చేయాలి?

ఆంధ్రా స్టైల్‌లో మష్రూమ్ ఎలా ట్రై చేయాలో చూద్దాం.. బరువును తగ్గించడంతో పాటు డయాబెటిస్‌ను కంట్రోల్ చేసే మష్రూమ్‌తో స్పైసీ రిసిపీ ఎలా చేయాలో చూద్దాం..
 
కావలసిన పదార్థాలు :
మష్రూమ్స్ : అర కేజీ 
నూనె, ఉప్పు : తగినంత 
పచ్చి మిర్చి ముక్కలు : పావు కప్పు 
కొత్తిమీర, దాల్చిన చెక్క, కరివేపాకు : కాసింత 
ధనియాలు : ఒక స్పూన్ 
ఏలకులు : అర స్పూన్
ఆవాలు : అర స్పూన్ 
అల్లం వెల్లుల్లి పేస్ట్ : రెండు టీ స్పూన్లు
ఉల్లిపాయ తరుగు : ఒక కప్పు 
కొబ్బరి తురుము : అర కప్పు 
 
తయారీ విధానం : 
స్టౌ మీద కడాయి పెట్టి వేడయ్యాక నూనె పోయాలి. అందులో కొబ్బరి తురుము, మిర్చి, దాల్చిన చెక్క, ధనియాలు దోరగా వేపుకోవాలి. ఇదో ప్లేటులోకి తీసుకుని.. ఆరిన తర్వాత పేస్ట్‌లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మరో బాణలిలో నూనె పోసి అందులో ఆవాలు వేసి అల్లం వెల్లుల్లి ముద్దను వేసి దోరగా వేపుకోవాలి. ఇందులోనే ఉల్లిపాయలు, కరివేపాకు వేసి దోరగా వేపుకోవాలి. ఇందులోనే మష్రూమ్‌ను చేర్చాలి.

ఈ మిశ్రమానికి కావలసిన ఉప్పు చేర్చి 5 నిమిషాల పాటు ఉడికించాలి. మష్రూమ్ బాగా ఉడికాక మెత్తగా రుబ్బి పెట్టుకున్న కొబ్బరి పేస్టును చేర్చి.. కాసింత నీరు చేర్చి గ్రేవీల తయారయ్యాక దించేయాలి. దీనిని రైస్‌కు లేదా రోటీలకు సైడిష్‌గా సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోద్ది.