శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By Selvi
Last Updated : మంగళవారం, 20 జనవరి 2015 (12:32 IST)

బనానా స్పెషల్ : బనానా స్టిర్ ఫ్రై రిసిపీ!

గ్రీన్ బనానాలో ఫైబర్ పుష్కలంగా ఉంది. ఒక కప్పు ఉడికించిన అరటికాయలో 3.6 గ్రాముల ఫైబర్ వుంటుంది. ఇది మధుమేహాన్ని, హృద్రోగ సమస్యలను దూరం చేస్తుంది. జీర్ణక్రియను సక్రమం చేస్తుంది. బరువును నియంత్రిస్తుంది. అలాంటి అరటితో బనానా స్టిర్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు : 
అరటి కాయలు : నాలుగు 
ఉల్లిపాయలు : రెండు 
ఎండు కొబ్బరి :  అరముక్క 
నూనె : తగినంత 
ఆవాలు : తగినంత 
ఇంగువ : చిటికెడు 
మినపప్పు : ఒక స్పూన్ 
మిరపకాయలు : నాలుగు 
పసుపు : కొద్దిగా 
ఉప్పు : తగినంత. 
 
తయారీ విధానం : 
ముందుగా అరటికాయల్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు చిన్నగా తరుక్కోవాలి. కొబ్బరిని పొడి చేసుకోవాలి. ఒక పాత్రలో నూనె వేసి కాస్త వేడి అయ్యాక, ఆవాలు, ఇంగువ వేసుకోవాలి. తర్వాత మినపప్పు వేసుకోవాలి. కొంచెం వేయించాక మిరపకాయలు, పసుపు, ఉల్లిపాయలు వేసి మరి కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు అరటి ముక్కలు వేసి, ఉప్పు వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. చిన్నమంటపై ఉడికించాలి. కాసేపయ్యాక కొబ్బరి పొడి వేసి కలుపుకోవాలి. అంతే బనానా స్టిర్ ఫ్రై రెడీ.