శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By chitra
Last Updated : శనివారం, 16 ఏప్రియల్ 2016 (16:41 IST)

కాకరకాయతో వెరైటీ మంజూరియన్ ఎలా చేయాలి?

కాకరలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. కాకరకాయ మధుమేహానికి ఎంతో మేలు చేస్తుందని న్యూట్రీషన్లు అంటున్నారు. అలాంటి కాకరతో వెరైటీ మంజూరియన్ చేస్తే ఎలా వుంటుందో ట్రై చేద్దామా?
 
కావలసిన పదార్థాలు :
కాకరకాయలు : పావు కేజీ 
మైదా - ఒక కప్పు 
కార్న్ ఫ్లోర్ - అర కప్పు 
మిరప్పొడి - ఒక టీ స్పూన్
నిమ్మరసం - అర టీ స్పూన్ 
ఉల్లిపాయ తరుగు - పావు కప్పు
టమోటా తరుగు - పావు కప్పు 
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - ఒక టీ స్పూన్ 
పసుపు - చిటికెడు 
ఉప్పు - సరిపడా 
నూనె - సరిపడా
టమోటా సాస్ - తగినంత
సోయాసాస్ - తగినంత
 
తయారీ విధానం:
ముందుగా కాకరకాయ ముక్కల్ని ఉప్పు నీటిలో కాసేపు ఉంచాలి. తర్వాత కాకర ముక్కలను వేరొక పాత్రలోకి తీసుకుని మైదా, కార్న్ ఫ్లోర్, నిమ్మరసం చేర్చి బాగా కలిపి పావు గంట నానబెట్టాలి. తర్వాత గ్యాస్ పైన బాణలి పెట్టి అందులో నూనె పోసి వేడయ్యాక కాకర మిశ్రమాన్నివేసి దోరగా వేయించి ఓ పాత్రలోకి తీసుకోవాలి. తరువాత ఇంకో పాత్రలో నూనె పోసి పోపు గింజలు, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, టమోటా తరుగు, టమోటా సాస్, సోయాసాస్, ఉప్పు, కారం, బాగా వేపుకుని దీంతో వేయించిన కాకరను చేర్చి బాగా కలపాలి. ఐదు నిమిషాల తర్వాత దించేయాలి. అంతే వెరైటీ కాకరకాయ మంజూరియన్ రెడీ.