మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 19 జూన్ 2018 (17:36 IST)

జీలకర్ర, ఎండుమిర్చి పచ్చడి తయారీ విధానం....

జీలకర్ర యాంటీ-సెప్టిక్ కారణాలను కలిగి ఉండడం ద్వారా జలుబు, ఫ్లూను కలుగజేసే కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. జీలకర్రలో క్యాల్షియం, ఫాస్ఫరస్‌, ఐరన్‌, సోడియం, పొటాషియం, విటమిన్‌ ఎ, సి ఎక్కువగా ఉన్నాయి.

జీలకర్ర యాంటీ-సెప్టిక్ కారణాలను కలిగి ఉండడం ద్వారా జలుబు, ఫ్లూను కలుగజేసే కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. జీలకర్రలో క్యాల్షియం, ఫాస్ఫరస్‌, ఐరన్‌, సోడియం, పొటాషియం, విటమిన్‌ ఎ, సి ఎక్కువగా ఉన్నాయి. జీలకర్రలో ఐరన్‌ పుష్కలంగా లభించడం వలన రక్తంలో హిమోగ్లోబిన్‌ తయారవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
 
కావలసిన పదార్థాలు:
ఎండుమిర్చి - 6
చింతపండు - సరిపడా
ఉప్పు - తగినంత
నూనె - కొద్దిగా
పోపుదినుసులు - సరిపడా
జీరకర్ర - కొద్దిగా
టమాటాలు - 3
ఉల్లిపాయలు - 1/2 కప్పు
కరివేపాకు - కొద్దిగా
 
తయారీ విధానం: 
ముందుగా చింతపండును కొద్దిగా నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనెను పోసి వేడయ్యాక ఎండుమిర్చి, జీరకర్ర వేసి బాగా వేగిన తరువాత వాటిని తీసివేసి అదే బాణలిలో టమాటాలు వేసి బాగా వేగనిచ్చి పక్కన పెట్టుకోవాలి. రోలులో వేపిన ఎండుమిర్చి, జీలకర్ర వేసి దంచుకుంటూ కాస్త ఉప్పు, చింతపండు వేసి రుబ్బుకుంటూ అందులో ఉల్లిపాయలు వేసుకుని దంచుకోవాలి. చివరగా ఆ మిశ్రమంలో వేపిన టమాలు వేసి దంచుకుని పచ్చడిని తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. మల్లీ బాణలిలో నూనెను పోసి వేడయ్యాక పోపుదినుసులు, కరివేపాకు వేసి వేగనిచ్చి అందులో పచ్చడి వేసి కలుపుకోవాలి. అంతే జీలకర్ర పచ్చడి రెడీ.