శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By Selvi
Last Updated : శనివారం, 7 నవంబరు 2015 (18:59 IST)

దీపావళి స్పెషల్: పిల్లలు ఇష్టపడి తినే గవ్వలు ఎలా చేయాలి?

దీపావళి స్పెషల్: పిల్లలు ఇష్టపడి తినే గవ్వలు ఎలా చేయాలో తెలుసా.. అయితే ఇదిగోండి తయారీ విధానం. 
 
కావలసిన పదార్థాలు :
మైదా పిండి - ఒక కేజీ
పంచదార - ఒక కేజీ 
ఉప్పు - తగినంత 
బొంబాయి రవ్వ - కేజీ 
పాలు - రెండు గ్లాసులు 
నూనె - అర కేజీ 
 
తయారీ విధానం : 
ముందుగా మైదా పిండి, బొంబాయి రవ్వని జల్లెడ పట్టి సరిపడా ఉప్పు వేసి అందులో పాలను కలుపుకోవాలి. ఈ పిండిని పూరీలకు తగ్గట్టు కలుపుకోవాలి. ఈ పిండి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని గవ్వల చెక్కల మీద పెట్టి ఉండలుగా చేసి బొటన వేలితో గవ్వల్లా నొక్కుకోవాలి.

పిండినంతా గవ్వల్లా చేసుకున్నాక.. పొయ్యి మీద పాన్ పెట్టి నూనె పోసుకోవాలి. కాగాక గవ్వలను వేయించుకోవాలి. అన్ని గవ్వలు వేయించుకున్నాక పంచదార ముదురు పాకం పట్టుకుని అందులో సిద్ధం చేసుకున్న గవ్వల్ని వేసి కలుపుకోవాలి.