శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 17 అక్టోబరు 2014 (18:51 IST)

హెల్దీ అండ్ టేస్టీ మష్రూమ్స్ కర్రీ ట్రై చేయండి!

మష్రూమ్స్ ఆయుష్షును పెంచుతాయి. విటమిన్ డిని పుష్కలంగా కలిగివుండే మష్రూమ్స్‌ను వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా ఒబిసిటీని దూరం చేసుకోవచ్చు. ఇంకా క్యాన్సర్ బారిన పడకుండా తప్పించుకోవచ్చు. అలాగే వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాంటి మష్రూమ్స్‌తో టేస్టీ అండ్ హెల్దీ కర్రీ ఎలా వుంటుందో ట్రై చేద్దామా...?
 
కావలసిన పదార్థాలు :
మష్రూమ్స్: మూడు కప్పులు 
చింతపండు: రెండు టీస్పూన్లు (నీళ్లల్లో నానబెట్టాలి) 
ఉప్పు: రుచికి తగినంత
నూనె: తగినంత 
ఆవాలు: ఒక టీ స్పూన్ 
ఎండుమిర్చి: నాలుగు 
కొత్తిమీర: కొద్దిగా
ఉల్లిపాయ తరుగు : ఒక కప్పు 
టొమాటో తరుగు : ఒక కప్పు 
కరివేపాకు: గార్నిష్‌కు తగినంత
గరంమసాలా: ఒకటిన్నర టీ స్పూన్
శనగపప్పు: ఒకటిన్నర టీ స్పూన్ 
మిరియాల పొడి: ఒకటిన్నర టీ స్పూన్
 
తయారీ విధానం :
పాన్‌లో నూనె కాగాక పోపు వేసి కరివేపాకు, ఎండుమిర్చి వేసి దోరగా వేపుకోవాలి. ఇందులో ఉల్లి, టమోటా తరుగును చేర్చి బాగా బ్రౌన్‌గా ఫ్రై చేసుకోవాలి. వీటితోనే మష్రూమ్స్‌తో పాటు ఉప్పు చేర్చి మూతపెట్టి ఉడికించాలి. 
 
తర్వాత చింతపండు గుజ్జును చేర్చి పది నిమిషాల తర్వాత గరం మసాలా వేసి ఐదు నిమిషాలుంచి.. కొత్తిమీర, కరివేపాకు తరుగుతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే మష్రూమ్ కర్రీ రెడీ. ఇది వేడివేడి అన్నంలోకి, రోటీల మీదకు చాలా టేస్టీగా ఉంటాయి.