బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By Selvi
Last Updated : సోమవారం, 16 మార్చి 2015 (19:12 IST)

హెల్దీ బ్రేక్ ఫాస్ట్.. వెజ్‌టేబుల్ ఇడ్లీ..!

పిల్లలకే కాదు.. పెద్దల ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయలతో ఇడ్లీ ట్రై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు :
ఇడ్లీ పిండి : తగినంత 
పచ్చిమిర్చి : పావు కప్పు 
కరివేపాకు  తరుగు : పావు తప్పు 
ఉప్పు : తగినంత 
కూరగాయల తరుగు : రెండు కప్పులు. 
 
తయారు విధానం: 
ఇడ్లీ పిండిని ముందుగా ఎలా తయారు చేసుకోవాలంటే.. బియ్యం, మినపప్పు, శెనగపప్పును ముందుగా నానబెట్టుకోవాలి. బియ్యంతో పాటు మినప, శెనగపప్పు, పచ్చిమిర్చిని చేర్చి మెత్తగా గాకుండా రవ్వలా రుబ్బుకుని బౌల్‌లోకి తీసుకోవాలి. ఈ పిండిని రెండు లేదా మూడు గంటలకు ముందే ఈ పిండిని సిద్ధం చేసుకోవాలి. ఈ పిండిలో కూరగాయల తరుగు, కరివేపాకు, కొత్తిమీర తరుగు చేర్చాలి. తర్వాత ఇడ్లీల్లా పోసుకుని 20 నిమిషాల పాటు ఉడికిస్తే వెజ్ ఇడ్లీ రెడీ.. ఈ ఇడ్లీకి టమోటా లేదా కొబ్బరి చట్నీ గుడ్ కాంబినేషన్.