మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By
Last Updated : శుక్రవారం, 28 డిశెంబరు 2018 (12:11 IST)

మిర్చీ ఆయిల్ సూప్ ఎలా చేయాలో తెలుసా...?

కావలసిన పదార్థాలు:
క్యారెట్ - 1
ఆలూ - 1
టమోటా - 1
ఉల్లిపాయ తరుగు - 1 స్పూన్
వెల్లుల్లి - 1
ఎండుమిర్చి - 1
నూనె - 3 స్పూన్స్
ఉప్పు - సరిపడా
నీరు - 3 కప్పులు.
 
తయారీ విధానం:
సూప్ చేసుకోవాలంటే.. ముందు రోజు రాత్రి రెండు స్పూన్ల నూనెను బాగా వేడి చేసి సన్నగా తరిగిన ఎండుమిర్చి వేసి వెంటనే మూతపెట్టి స్టౌవ్ ఆపేయాలి. మరుసటి ఉదయాన్నే క్యారెట్, ఆలూ, టమోటా ముక్కల్ని మెత్తబడేవరకు ఉడికించుకోవాలి. మరో బాణలిలో 1 స్పూన్ నూనె వేసి ఉల్లి తరుగు, వెల్లుల్లి రేకని వేసి బాగా కలుపుకోవాలి. ఆ తరువాత రాత్రి తయారుచేసిన మిర్చీ ఆయిల్‌ను ఈ మిశ్రమంలో వేసి తీసుకుంటే.. నోరూరించే మిర్చీ ఆయిల్ సూప్ రెడీ.