శనివారం, 30 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By
Last Updated : మంగళవారం, 16 అక్టోబరు 2018 (12:51 IST)

పన్నీర్‌తో దోశెలే కాదు.. పులావ్స్ కూడా...

పన్నీర్ అంటే పిల్లలు చాలా ఇష్టాంగా తింటారు. పన్నీర్‌లోని మినరల్స్ పిల్లల ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. మరి ఇటువంటి పన్నీర్‌తో పులావ్ ఎలా చేయాలో చూద్దాం...
 
కావాలసిన పదార్థాలు:
బాస్మతీ రైస్ - 1 కప్పు 
పన్నీర్ ముక్కలు - 1 కప్పు 
బఠాణీలు - అరకప్పు 
క్యారెట్ ముక్కలు - అరకప్పు 
కార్న్ - అరకప్పు 
బటర్ - 2 స్పూన్స్ 
జీలకర్ర -  1 స్పూన్ 
కరివేపాకు - రెండు రెమ్మలు 
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్ 
పచ్చిమిర్చి - 2 
గరం మసాలా - అరస్పూన్ 
కొత్తిమీర - చిన్న కట్ట 
ఉప్పు - సరిపడా 
నూనె - తగినంత.
 
తయారీ  విధానం: 
ముందుగా బియ్యం కడిగి 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనెను పోసి వేడయ్యాక జీలకర్ర, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి రెండు నిమిషాల పాటు కలుపాలి. ఆ తరువాత ఈ మిశ్రమంలో బఠాణీలు, క్యారెట్ ముక్కలు, కార్న్, పన్నీర్, ఉప్పు వేసి నిమిషం పాటు కలుపాలి. ఆ తర్వాత బియ్యం వేసి నీళ్లు పోసి పావుగంట పాటు ఉడకనివ్వాలి. అన్నం మొత్తం ఉడికాక.. కొత్తిమీర, గరం మసాలా వేసి కలిపి మూత పెట్టేయాలి. రెండు నిమిషాలు ఉంచి దించేయాలి. అంతే... వేడివేడి పన్నీరీ పులావ్ రెడీ.