శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By
Last Updated : బుధవారం, 26 డిశెంబరు 2018 (12:55 IST)

సగ్గుబియ్యం దోశ తయారీ విధానం..?

కావలసిన పదార్థాలు:
సగ్గుబియ్యం - 1 కప్పు
శెనగపిండి - అరకప్పు
బియ్యం పిండి - అరకప్పు
ఉప్పు - తగినంత
సన్నగా తరిగిన అల్లం ముక్కలు - కొన్ని
ఉల్లిపాయ ముక్కలు - అరకప్పు
పచ్చిమిర్చి - 3
జీలకర్ర - చెంచా 
కొత్తిమీర తరుగు - కొద్దిగా
నూనె - అరకప్పు.
 
తయారీ విధానం:
ముందుగా సగ్గు బియ్యంలోని నీళ్లు వంపేయకుండా శెనగపిండి, బియ్యంప్పిండి, ఉప్పువేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పెనంపై మరీ పలుచగా కాకుండా కాస్త మందంగానే దోశ వేసి పైన ఉల్లిపాయ, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర చల్లుకోవాలి. దోశ చుట్టూ నూనె వేసి మూతపెట్టుకోవాలి. 5 నిమిషాల తరువత దోశ మెత్తగా మారుతుంది. అంతే.. ఆరోగ్యానికి మేలు చేసే సగ్గుబియ్యం దోశ రెడీ.