శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By Selvi
Last Updated : గురువారం, 8 జనవరి 2015 (18:20 IST)

ఆరోగ్యానికి మేలు చేసే ఓట్స్ సూప్ ఎలా చేయాలి?

ఓట్స్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుంది. ఓట్స్ సూప్ రిసిపి చాలా సులభంగా పది నిముషాల్లో తయారుచేసేయవచ్చు. ఓట్స్‌ను సాధారణంగా బ్రేక్ ఫాస్ట్‌గా తీసుకుంటారు. అయితే చలికాలంలో ఈవెనింగ్ స్నాక్‌గా తీసుకోవచ్చు.
 
కావల్సిన పదార్థాలు:
ఓట్స్: ఒక కప్పు 
పాలు: ఒక కప్పు 
వెల్లుల్లి తరుగు : రెండు స్పూన్లు 
ఉప్పు: రుచికి సరిపడా
పెప్పర్: కొద్దిగా
నూనె: కొద్దిగా
ఉల్లిపాయ తరుగు :  అరకప్పు 
కొత్తిమీర తరుగు కొద్దిగా
 
తయారీ విధానం :
పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడి చేసి.. ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసి బ్రౌన్ కలర్‌ వచ్చేంతవరకు వేయించుకోవాలి. మరో పాత్రలో నీళ్ళుపోసి అందులో రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్ వేసి ఉడికించుకోవాలి. చిక్కగా ఉడికిన తర్వాత అందులో పాలు మిక్స్ చేయాలి. ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత అందులో రోస్ట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, ఉప్పు, పెప్పర్ పౌడర్ వేసి మిక్స్ చేసి.. చివరిగా కొత్తిమీర గార్నిష్‌తో వేడి వేడిగా సర్వ్ చేయాలి.