గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By Kowsalya
Last Updated : గురువారం, 28 జూన్ 2018 (09:42 IST)

ఉల్లికాడల పులావ్ తయారీ విధానం.....

ఉల్లికాడలతో పులావ్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

ఉల్లికాడలతో పులావ్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
 
కావలసిన పదార్థాలు:
బాస్మతి బియ్యం- 1 కప్పు 
ఉల్లికాడల తరుగు - 3 కప్పులు
సోంపు - 1 స్పూన్
జీడిపప్పులు లేదా బాదం - 2 స్పూన్స్
వెల్లుల్లి రెబ్బలు- పేస్ట్
ఉప్పు- తగినంత
చక్కెర- చిటికెడు
 
తయారీవిధానం: 
ముందుగా అన్నం ముద్దకాకుండా పొడిపొడిగా వండి చల్లార్చాలి. అన్నం ఉడికేటప్పుడే కాస్తంత ఉప్పు వేయాలి. ఇప్పుడు జీడిపప్పును పాన్‌లో వేగించి పక్కన పెట్టుకోవాలి. సన్నని మంటపై పాన్‌ ఉంచి వెన్నను వేడిచేసి అందులో సోంపు వేయాలి. అవి వేగాక అందులో ఉల్లికాడల ముక్కలు, వెల్లుల్లి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం మెత్తగా అయ్యే వరకూ స్టవ్‌ మీద ఉంచాలి. కూరను కిందికు దించి చల్లారిన అన్నం, వేగించిన జీడిపప్పు వేసి కలుపుకుని చివరిగా పులావ్‌లో ఉప్పు, చక్కెర వేసి కలుపుకోవాలి. అంతే ఉల్లికాడల పూలావ్ రెడీ.