శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By Selvi
Last Updated : సోమవారం, 25 మే 2015 (17:15 IST)

ఒబిసిటీని తగ్గించే బియ్యపు వడలు!

బియ్యం పిండితో వడలు కేరళ రిసిపీ. మన ఊరి గారెల కంటే బియ్యం పిండి క్రిస్పీగా ఉంటాయి. బియ్యంతో చేసే వడల్ని తీసుకోవడం ద్వారా బరువును నియంత్రించుకోవచ్చు. ఇందులోని లో క్యాలెరీలు బరువును తగ్గిస్తాయి. అలాంటి బియ్యం పిండితో వడలు ఎలా చేయాలో చూద్దాం..
 
కావలసిన పదార్థాలు :
బియ్యం పిండి : ఒక కప్పు 
కొబ్బరి తురుము : ఒక కప్పు 
పచ్చిమిర్చి : పావు స్పూన్ 
ఉల్లి తరుగు - అర కప్పు 
కొబ్బరి నూనె - తగినంత 
ఉప్పు - తగినంత 
 
తయారీ విధానం :
బియ్యాన్ని వేయించి.. పౌడర్‌గా చేసుకుని పక్కనపెట్టుకోవాలి. కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, ఉల్లిని మిక్సీలో రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని బియ్యం పిండిలో చేర్చి గారెలకు వీలుగా పిండిని నీటితో కలిపి సిద్ధం చేసుకోవాలి. ఇందులో ఉప్పు చేర్చి గారెల్లా నూనెలో వేపి తీసుకోవాలి. దోరగా వేగాక గ్రీన్ చట్నీతో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోద్ది..!