శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By CVR
Last Updated : గురువారం, 4 డిశెంబరు 2014 (16:11 IST)

హెల్తీ బ్రేక్ ఫాస్ట్... సోయా పరోటా

కావల్సిన పదార్థాలు: 
గోధుమ పిండి - రెండు కప్పులు 
నీళ్ళు - ఒక కప్పు 
ఉప్పు - తగినంత
క్యాబేజీ - అర కప్పు (తురిమి, ఉడికించుకోవాలి)
పెసరపప్పు - ¼ కప్పు (ఉడికించుకోవాలి)
సోయా - ¼ కప్పు (పొడిచేసుకోవాలి)
బంగాళాదుంప - ఒకటి (ఉడికించి, చిదిమిపెట్టుకోవాలి)
పచ్చి మిర్చి పేస్ట్ - ఒక టీ స్పూన్
పసుపు- ఒక టీ స్పూన్
జీలకర్ర - ఒక టీ స్పూన్
నూనె - మూడు టేబుల్ స్పూన్లు 
కొత్తిమీర - ఒక టేబుల్ స్పీన్ (చిన్న ముక్కలుగా తరిగాలి)
 
తయారుచేయండి ఇలా :
మొదట స్టౌమీప పాన్ పెట్టి.. అందులో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక, జీలకర్ర వేసి ఒక నిముషం వేగించాలి. తర్వాత అందులో ముందుగా ఉడికించి పెట్టుకొన్న క్యాబేజ్ తురుము,  పెసరపప్పు వేసి, మీడియం మంట మీద 3-4 నిముషాలు వేగించుకోవాలి.
 
ఇప్పుడు అందులోనే సోయా పొడి, చిదిమి పెట్టుకొన్న బంగాళదుంప వేసి 4 -5 నిమిషాల పాటు మీడియం మంట మీద వేగనివ్వాలి. తర్వాత పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా వేగించుకోవాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి, అర గంట పాటు పూర్తిగా చల్లారనివ్వాలి.
 
ఇప్పుడు ఒక బోలు గిన్నె తీసుకుని అందులో గోధుమ పిండి, ఉప్పు, నీళ్ళు పోసి సున్నితంగా పిండిని చపాతి పిడిలాగా కలుపుకోవాలి. పదినిముషాల తర్వాత పిండి నుండి కొద్దికొద్దిగా తీసుకొని చపాతీ కర్రతో చపాతీల వేలో రుద్దు కోవాలి. 
 
తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకొన్న స్టఫింగ్‌ను చపాతీ మధలో పెట్టి మడిచి అన్ని వైపులా క్లోజ్ చేసి, తిరిగా చపాతీల లగా ఫ్లాట్ గా రోల్ చేసుకోవాలి. తర్వాత స్టౌ మీద తవా పెట్టి, వేడయ్యాక స్టఫ్డ్ పరోటాను వేసి, వేడిచేస్తూ రెండు వైపులా గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి. 
 
ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత మిగిలిన పరోటాలను కూడా అలాగే తయారుచేసుకోవాలి. అంతే రుచికరమై బ్రేక్ ఫాస్ట్ సోయా పరోటా రెడీ.