శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By Selvi
Last Updated : మంగళవారం, 13 జనవరి 2015 (17:09 IST)

సంక్రాంతి: తెలంగాణ స్పెషల్ సకినాలు ఎలా చేయాలి?

తెలంగాణలో సంక్రాంతి పండుగకు రెండు రోజుల ముందే సకినాలు (చక్కిలాలు) చేస్తారు. అవి ఎలా చేయాలంటే..?
 
కావలసిన పదార్థాలు:
కొత్త బియ్యం : రెండు కప్పులు
నువ్వులు : పావు కప్పు 
వోమం : రెండు టీ స్పూన్లు 
మంచినూనె, ఉప్పు : తగినంత 
 
తయారీ విధానం :
ముందుగా బియ్యాన్ని కడిగి నాలుగు గంటల పాటు నాన బెట్టుకోవాలి. తర్వాత వడగట్టి తడిసిన బియ్యాన్ని వేరుచేసి.. మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బేటప్పుడు కొద్దిపాటి నీటిని చిలకరించుకోవాలి. అయితే పిండి అతి గట్టిగాను అతి పలుచగా కాకుండా చూసుకోవాలి.
 
తర్వాత చేతుల్ని శుభ్రం చేసుకుని.. నువ్వులను పొడిచేసి వోమను తగినంత ఉప్పును బియ్యం పిండిలో కలపాలి. తర్వాత ఒక శుభ్రమైన వస్త్రంపై పిండితో గుండ్రంగా మెలితిప్పుతూ చక్రాల మూడుకాని నాలుగు చుట్లూ కాని చుట్టాలి. 
 
ఒక గంట సేపు ఆ చక్రాల్లోని తడిని ఆ చక్రం పీల్చుకుంటుంది. ఆ తర్వాత ఆ సకినాలను నూనెలో దొరగా వేయించి తీయాలి. అంతే రుచికరమైన కరకరమనిపించే చకినాలు రెడీ.