ఆదివారం, 5 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 5 జులై 2023 (11:34 IST)

శరీర వేడికి విరుగుడిగా కొబ్బరి నీటితో స్వీట్ ఇడ్లీ ఎలా?

Tender Coconut Idli
Tender Coconut Idli
శరీర వేడికి విరుగుడిగా కొబ్బరి నీళ్లు తాగుతుంటాం. అలాగే శరీర వేడిని తగ్గించేందుకు కొబ్బరినీటిలో ఇడ్లీలు ఎలా తయారు చేయాలో చూద్దాం.. 
 
కావలసినవి: ఇడ్లీ బియ్యం - ఒక కేజీ
మినపప్పు - పావు కేజీ 
మెంతులు- తగినంత 
నీళ్లు - కావలసినంత 
ఉప్పు - కొద్దిగా.
 
ముందుగా... ఇడ్లీ బియ్యం, మెంతులు బాగా కడిగి గంటసేపు నానబెట్టాలి. మినపప్పును సపరేటుగా నానబెట్టాలి. బియ్యం, మినపప్పు గ్రైండ్ చేసేటప్పుడు నీళ్లకు బదులు కొబ్బరినీళ్లు వాడాలి. అలాగే మినపప్పు రుబ్బేటప్పుడు నీళ్లకు కొబ్బరి నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా తయారైన ఇడ్లీ పిండిని పులియబెట్టి మరుసటి రోజు ఇడ్లీలు ఉడికించుకుంటే అంతే కొబ్బరి నీటిలో ఇడ్లీ రెడీ అయినట్లే. తినడానికి తీపిగా ఉండే ఈ ఇడ్లీ శరీర వేడిమికి విరుగుడు. పిల్లలు ఈ ఇడ్లీని ఇష్టపడి తింటారు. 
 
గమనించదగిన అంశాలు.. ఇడ్లీ పిండిని రుబ్బేటప్పుడు పిండిని ముట్టుకోకుండా చెంచా వాడితే మంచిది. పిండిని అల్యూమినియం లేదా ఇత్తడి పాత్రల్లో ఉంచితే త్వరగా పులిసిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎవర్సిల్వర్ డబ్బాలో ఉంచడం మంచిది. 
 
స్టవ్ పక్కన పిండిని ఉపయోగించడం మానుకోండి. కారణం వేడిలో పిండి త్వరగా పులిసిపోతుంది.  పులుపు సరైన స్థాయిలో ఉంటేనే ఇడ్లీ రుచిగా ఉంటుంది. ఈ ఇడ్లీలను కారం చట్నీతో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతోంది.