మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 4 నవంబరు 2014 (15:09 IST)

సామర్థ్యానికి మించి మహిళలు పనిచేస్తే..?

సామర్థ్యానికి మించి పనిచేయడమే మహిళల్లో ఒత్తిడికి కారణమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మగవారితో పోలిస్తే, కార్యాలయాలు లేదా ఇళ్ళలో కూడా స్త్రీలు త్వరగా ఒత్తిడికి లోనౌతారు. నిరాశకు గురవుతారు. పరిశోధకుల ప్రకారం, స్త్రీలలో ఉత్పత్తి అయ్యే ఒత్తిడి హార్మోన్లు పురుషులలో కన్నా ఎక్కువ కావడమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 
అలాగే చాలా మంది స్త్రీలకు రకరకాల ఆరోగ్య సమస్యలుంటాయి. వాటిలో కొన్ని మానసిక అనారోగ్యాలు, డైటింగ్ వల్ల వచ్చే ప్రభావం, నిస్సత్తువ వంటివి ఒత్తిడిని పెంచుతాయి. ఇక  రుతువిరతి లేదా మెనోపాజ్ కాలంలో ప్రతి స్త్రీ ఒక విలక్షణమైన మానసిక స్థితిని అనుభవిస్తుంది. యుక్త వయసులో శరీరంలో వచ్చే మార్పుల వల్ల కూడా స్త్రీలలో ఒత్తిడి కలగవచ్చు. అయినా వీటిని అధిగమించగలిగే సామర్థ్యం వుంటేనే.. ఆయుష్షు పెరుగుతుందని మానసిక నిపుణులు అంటున్నారు.