మేకప్ వేసుకుంటే మంచి మార్కులొస్తాయా..అయితే మగాళ్లూ మేకప్‌కి దిగిపోవాల్సిందే!
మేకప్ వేసుకుంటే శరీర సౌందర్యం ఇనుమడించేమాట ఏమో కానీ విద్యార్థినులు మాత్రం బాగా చదివేసి మంచి మార్కులు కొట్టేస్తున్నారని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. మగపిల్లలకు ఈర్ష్యను, ఆడపిల్లలకు ఉత్సాహాన్ని కలిగించే ఈ పరిశోధనను అమెరికాలోని వివిధ యూనివర్సిటీలకు చె
మేకప్ వేసుకుంటే శరీర సౌందర్యం ఇనుమడించేమాట ఏమో కానీ విద్యార్థినులు మాత్రం బాగా చదివేసి మంచి మార్కులు కొట్టేస్తున్నారని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. మగపిల్లలకు ఈర్ష్యను, ఆడపిల్లలకు ఉత్సాహాన్ని కలిగించే ఈ పరిశోధనను అమెరికాలోని వివిధ యూనివర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తలు విస్తృత ప్రాతిపదికపై నిర్వహించడంతో మేకప్‌కు మార్కులకూ మధ్య బాదరాయణ సంబంధం ఏమిటన్నది ఆసక్తికరంగా మారిపోయంది.
మేకప్ వేసుకోవటం వల్ల మహిళల్లో ఆత్మస్థైర్యం పెరిగి చదువులో మంచి మార్కులు సాధిస్తారని ఇటీవల జరిగిన పరిశోధనలో వెల్లడైంది. అమెరికాలోని వివిధ యూనివర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తలు అకడమిక్ పెర్ఫామెన్స్‌పై మేకప్ ప్రభావం ఏ మేరకు ఉంటుందన్న విషయంపై పరిశోధనలు నిర్వహించారు.
శాస్త్రవేత్తలు ముందుగా మహిళలను మూడు గ్రూపులుగా విభజించి.. ఒక గ్రూపు వారికి మేకప్‌ను వేయగా, రెండవ గ్రూప్ వారికి సంగీతం వినిపించారు. ఇక మూడో వారికి మొహంపై రంగులు అద్దారు. అనంతరం మూడు గ్రూపులకు చెందిన మహిళలకు జనరల్ సైకాలజీలో పరీక్ష నిర్వహించారు.
ఈ పరీక్షలో మేకప్ వేసుకున్న మహిళలు మంచి మార్కులు తెచ్చుకున్నారు. ఆ తర్వాతి స్థానంలో సంగీతం విన్నవారు నిలిచారు. మేకప్ వేసుకోవటం వల్ల తాము అందంగా ఉన్నామన్న భావన పెరిగి, వ్యక్తిత్వం మీద ప్రభావం చూపుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ విషయాన్ని కోజెంట్ సైకాలజీ అనే జర్నల్ ప్రచురించింది.
ఈ పరిశోధన ఫలితాలు నిజమే అయినట్లయితే మగాళ్లూ వెంటనే మీరూ మేకప్ కిట్ కొనుక్కుని డైలీ రంగులద్దుకుంటేనే బాగుపడతారు. మేకప్ కిట్లకు ఖర్చులెక్కడినుంచి వస్తాయంటారా.. ఆడపిల్లలకు ఆ ఖర్చులు ఎలా వస్తున్నాయో మీకు అలాగే వచ్చేలా చేసుకోవాలి మరి. అయినా బీడీలకు, సిగిరెట్లకు, ఇంకా రకరకాల గలీజులకు తగలేస్తున్న డబ్బును కాస్త మిగిలించుకుంటే మేకప్ కిట్లు రావా ఏంటి?