1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 24 జనవరి 2020 (21:48 IST)

నెలసరి నొప్పికి విరుగుడు చామంతి పూల టీ

చామంతి పూలలోని ఔషధ గుణాలు అనేక రకాల గర్భకోశ సమస్యలను నివారిస్తాయి. ఒక కప్పు నీటిని మరిగించి రెండు టీస్పూన్ల చామంతి రేకులను వేసి మూతపెట్టి మంట మీద నుండి దించేయాలి. ఐదు నిమిషాల తరవాత వడపోసి తాగాలి. ఈ చేమంతి టీలో రుచి కోసం కొంచెం తేనె కాని, చెక్కెర కాని కలుపుకోవచ్చు. 
 
నెలసరి మొదలు కావడానికి రెండు లేదా మూడు రోజుల ముందు నుంచి రోజుకో కప్పు తీసుకోవాలి. అలాగే మొదలైన తర్వాత రోజుకు రెండు కప్పులు తాగాలి. ఇలా చేయడం వల్ల బ్లీడింగ్ సమయంలో కండరాలు పట్టేసినట్లయి నొప్పి రావాటాన్ని నివారించవచ్చు. ఏడాది పొడవునా తాజా చామంతిపూలు దొరకడం కష్టం కాబట్టి అందుబాటులో ఉన్నప్పుడు వాటిని ఎండబెట్టి నిల్వచేసుకుని వాడుకోవచ్చు.