Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రతి భర్త భార్యకు చెప్పాల్సింది..!

ఆదివారం, 3 సెప్టెంబరు 2017 (14:53 IST)

Widgets Magazine
dutch couple

ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలంటారు పెద్దలు. ఎందుకంటే ఇల్లు పరిస్థితే ఇల్లాలు ఎలాంటిదో చెప్పేస్తుంది. మరి అలాంటిది ఇంటిని ఇల్లాలు ఎలా ఉంచుకోవాలో తెలుసుకుందామా? ఒక అరటిపండును తొక్కలను ఓవెన్‌లో బేక్ చేసి గులాబీ మొక్కల కుండీలో కలిపితే కావాల్సినంత పొటాషియం అంది గులాబీ పువ్వులు చక్కగా పూస్తాయి. 
 
ఆకుకూరలు, కొత్తిమీర కాడలు ముదిరి బిరుసుగా ఉంటే వాటిని మొక్కల మొదళ్ళలో వేస్తే మంచి ఎరువుగా ఉపయోగపడతాయి. ఇంట్లో ఫర్నిచర్స్‌కు రంగులు వేసేటప్పుడు కుర్చీ లేదా డైనింగ్ టేబుల్ నాలుగు కోళ్ళ కింద సీసా మూతలను ఉంచితే రంగు కారినా గచ్చుకు అంటుకోదు. 
 
ఇల్లు తుడిచే నీటిలో కాస్త ఉప్పు కలిపితే దోమలు, ఈగలు రావట. ఇల్లు తుడిచిన స్పాంజ్‌లో నీటిని విదిలించి ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి పెడితే ఎండిపోయి త్వరగా పాడు కాకుండా ఉంటాయి. పనిమీద ఒక వారంపాటు మీరు బయటకు వెళితే ఇంటికి వచ్చి తలుపులు తెరిస్తే ఒకలాంటి వాసన వస్తుంది.

అప్పుడు వెంటనే కర్పూరం అంటించి అన్ని గదుల్లోను ఉంచాలి. ఈగలను పారద్రోలడంలో మిరియాలు మంచి కీటకనాశినిగా పనిచేస్తాయి కాబట్టి వాటిని వుపయోగించవచ్చు. వంటరూముల్లో మూలల్లో బోరిక్ పౌడర్ చల్లాలి. ఎలుకలు విసిగిస్తుంటే అవి ఎటువైపు నుంచి వస్తున్నాయో చూసి వాటి కలుగల వద్ద పుదీన రసంలో ఉంచిన దూది ఉండను పెడితే సరి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

మహిళ

news

ఉడికించిన బీట్‌రూట్‌ గుజ్జును మెడకు రాసుకుంటే?

బీట్‌రూట్‌తో అందాన్ని పెంపొందింపచేసుకోవచ్చు. బీట్‌రూట్ రసం, షుగర్ రెండింటి మిశ్రమాన్ని ...

news

క్లెన్సర్లు వాడొద్దు.. ఆ నూనెలే చాలు..

ముఖంపై వున్న మృతకణాలు తొలగించుకునేందుకు ఖరీదైన క్లెన్సర్లు వాడుతున్నారా? అయితే ఇక అలాంటి ...

news

బ్యూటీపార్లర్లకు ఎందుకు..? మచ్చలు, మొటిమలు తగ్గాలంటే?

పంచదారను మిక్సీలో రుబ్బుకుని బౌల్‌లోకి తీసుకోవాలి. అందులో ఆలివ్ ఆయిల్ కలుపుకోవాలి. ...

news

నెలసరి రావడానికి ముందు వక్షోజాల్లో నొప్పి.. క్యాన్సర్ ముప్పు?

నెలసరి రావడానికి ముందు వక్షోజాల్లో నొప్పి సహజం. కానీ నొప్పికి క్యాన్సర్‌కు లింకు ...

Widgets Magazine