శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By Kowsalya
Last Updated : బుధవారం, 5 సెప్టెంబరు 2018 (15:32 IST)

సైంధవ లవణ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే?

సైంధవ లవణం ఉప్పు కాదు. ఈ పదార్థం మెగ్నిషియం, సల్ఫేట్‌లతో తయారుచేసిన ఖనిజ లవణం. ఈ సైంధవ లవణంలో గల ప్రయోజనాలను తెలుసుకుందాం. ఒక బకెట్ నిండా గోరువెచ్చని నీళ్లు నింపుకుని అందులో రెండు కప్పుల సైంధవ లవణాన్న

సైంధవ లవణం ఉప్పు కాదు. ఈ పదార్థం మెగ్నిషియం, సల్ఫేట్‌లతో తయారుచేసిన ఖనిజ లవణం. ఈ సైంధవ లవణంలో గల ప్రయోజనాలను తెలుసుకుందాం. ఒక బకెట్ నిండా గోరువెచ్చని నీళ్లు నింపుకుని అందులో రెండు కప్పుల సైంధవ లవణాన్ని కలుపుకుని పూర్తిగా కరగనివ్వాలి. తరువాత ఆ నీటిలో స్నానం చేస్తే ఒంటి నొప్పులు, కండరాల నొప్పులు తగ్గుతాయి.
 
ముఖంపై గల నల్లటి వలయాలు తొలగిపోవడానికి గోరువెచ్చని నీటిలో కొద్దిగా సైంధవ లవణాన్ని కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. ఇలా తరచుగా చేయడం వలన మృతకణాలు తొలగిపోవడంతోపాటు నల్లటి వలయాల నుండి ఉపశమనం లభిస్తుంది. ఆర్గానిక్ కొబ్బరినూనెలో సైంధవ లవణాన్ని కలుపుకుని పెదాలకు మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వలన పెదాలు మృదువగా మారుతాయి.