శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 5 అక్టోబరు 2018 (12:04 IST)

మేకప్‌ ఎలా శుభ్రం చేయాలో తెలుసా..?

చర్మ సంరక్షణకు గ్లిజరిన్ చాలా ఉపయోగపడుతుంది. చర్మంపై గల జిడ్డును, మలినాలు, మేకప్‌ను తొలగిస్తుంది. చాలామంది మేకప్ వేసుకుంటారు కానీ దానిని ఎలా శుభ్రం చేయాలో తెలియదు.

చర్మ సంరక్షణకు గ్లిజరిన్ చాలా ఉపయోగపడుతుంది. చర్మంపై గల జిడ్డును, మలినాలు, మేకప్‌ను తొలగిస్తుంది. చాలామంది మేకప్ వేసుకుంటారు కానీ దానిని ఎలా శుభ్రం చేయాలో తెలియదు. అందుకు గ్లిజరిన్ వాడితే మంచి ఫలితం లభిస్తుంది. గ్లిజరిన్ ఎటువంటి కెమికల్స్ ఉండవు. కనుక దీనిని నేరుగా చర్మానికి వాడొచ్చును.
 
మేకప్‌ని ఎలా శుభ్రం చేయాలంటే.. ముందుగా ముఖాన్ని నీళ్లతో కడుక్కోవాలి. ఆ తరువాత గ్లిజరిన్‌లో దూదిని ముంచుకుని ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే మేకప్ శుభ్రంగా తొలగిపోతుంది. అలానే పాలలో కొద్దిగా గ్లిజరిన్ కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. రాత్రంతా అలానే ఉంచుకోవాలి. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం తాజాగా, కాంతివంతంగా మారుతుంది. 
 
గ్లిజరిన్ అందానికి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. దీనిని చర్మానికి రాసుకుంటే చర్మానికి తేమ లభిస్తుంది. అంటే గ్లిజరిన్ చర్మం నుండి నీరు బయటకు పోకుండా చేస్తుంది. అలానే చర్మం పొడిబారకుండా ఉంటుంది. దాంతో చర్మం మృదువుగా మారుతుంది. చర్మ కణాల ఉత్పత్తిని పెంచుటలో గ్లిజరిన్‌కి మించిన ఔషధం మరొకటి లేదు.