ఖతార్‌లో యూపీఐ సేవలు.. డీల్ కుదిరింది.. భారతీయులకు హ్యాపీ  
                                       
                  
				  				  
				   
                  				  నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) అంతర్జాతీయ విభాగమైన ఎన్పీసీఐఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (ఎన్ఐపీఎల్), క్యూఆర్ కోడ్‌ను ప్రారంభించేందుకు ఖతార్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న మిడిల్ ఈస్ట్ - ఆఫ్రికాలోని అతిపెద్ద ఆర్థిక సంస్థ అయిన క్యూఎన్బీతో గురువారం ఒప్పందం కుదుర్చుకుంది. గల్ఫ్ దేశం అంతటా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) చెల్లింపులు ఇక సులభం కానున్నాయి. 
				  											
																													
									  
	 
	ఇది క్యూఎన్బీ మర్చంట్ నెట్‌వర్క్ ద్వారా ఖతార్‌లో యూపీఐ చెల్లింపు అంగీకారాన్ని ఎనేబుల్ చేస్తుంది. దేశంలోని సందర్శించే, పర్యటించే చేసే భారతీయ ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుస్తుంది. 
				  
	 
	"ఖతార్‌లో యూపీఐని ప్రారంభించడం వల్ల దేశంలోని పెద్ద సంఖ్యలో భారతీయులు తమ లావాదేవీలను సులభతరం చేయడంతోపాటు విదేశాల్లో ఎటువంటి ఇబ్బంది లేని ప్రయాణ అనుభవాన్ని పొందగలుగుతారు" అని అనుభవ్ శర్మ డిప్యూటీ చీఫ్ (పార్ట్‌నర్‌షిప్స్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్, ఎన్పీసీఐ) ఒక ప్రకటనలో తెలిపారు.
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	 
	ఈ భాగస్వామ్యం భారతీయ పర్యాటకులకు రిటైల్ దుకాణాలు, పర్యాటక ఆకర్షణలు, విశ్రాంతి స్థలాలు, డ్యూటీ-ఫ్రీ షాపులు, హోటళ్లలో వారి ఇష్టపడే చెల్లింపు పద్ధతిని ఉపయోగించుకునే అవకాశాన్ని అందిస్తుంది
				  																		
											
									  
	 
	యూపీఐ చెల్లింపులను స్వీకరించడం ద్వారా, ఖతార్‌లోని వ్యాపారులు వేగవంతమైన, మరింత సౌకర్యవంతమైన చెల్లింపు, చెక్అవుట్ ప్రక్రియను కూడా అందించగలరు.