Romance Talk

Notifications

  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. మధుర జ్ఞాపకాలు



ఔను... నేను గుంపు మేస్త్రీనే: సీఎం రేవంత్ రెడ్డి, వీడియో

ఔను... నేను గుంపు మేస్త్రీనే: సీఎం రేవంత్ రెడ్డి, వీడియోనన్ను చాలామంది గుంపుమేస్త్రి అని అవహేళన చేస్తుంటారు, నిజమే నేను గుంపుమేస్త్రీనే అని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడుతూ... నన్ను గుంపుమేస్త్రీ అని ఎంతమంది అవహేళన చేసినా పట్టించుకోను. ఎందుకంటే నేను నిజంగానే గుంపుమేస్త్రీని. మంత్రులు, ప్రజలతో కూడిన గుంపుకి నేను మేస్త్రీని. ఈ గుంపే నాకు బలం. కార్యకర్త స్థాయి నుంచి వార్డ్ మెంబర్, జిల్లాస్థాయి ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాను. నన్ను అందరూ రేవంతన్న అంటారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన నేనేమి మారలేదు. నేను గుంపుమేస్త్రీనే. కొందరు గొప్పలు చెప్పుకుంటుంటారు.

గంగా- కావేరీ నదులను అనుసంధానించడం నా జీవిత ఆశయం: చంద్రబాబు

గంగా- కావేరీ నదులను అనుసంధానించడం నా జీవిత ఆశయం: చంద్రబాబుకర్ణాటకలోని హోస్పేటలో ఉన్న తుంగభద్ర డ్యామ్ వద్ద, కొత్తగా ఏర్పాటు చేసిన స్పిల్‌వే గేట్ల అధికారిక ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ పాల్గొన్నారు. ఆగస్టు 2024 వరదల సమయంలో డ్యామ్ 19వ గేటు కొట్టుకుపోయిన తర్వాత, ఒక నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు రూ.51 కోట్ల వ్యయంతో 33 కొత్త క్రెస్ట్ గేట్లను ఏర్పాటు చేసే భారీ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ ఇది. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగిస్తూ.. సాగునీరు, నీటి పారుదల ప్రాజెక్టులను దేశ ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించారు వీటిని పరిరక్షించడం భావి తరాల భవిష్యత్తుకు అత్యంత కీలకమని పునరుద్ఘాటించారు.